కరోనా అంటూ ప్రాంక్ చేశాడు... ఆ తరువాత అనుభవించాడు...

ప్రస్తుతం కరుణ వైరస్ చైనా దేశంలో ఎంతగా కలకలం సృష్టిస్తున్న అందరికీ బాగా తెలుసు.అయితే ఇప్పటికే చైనా దేశంలోని కొందరు ఈ వైరస్ బారినపడి దాదాపుగా వందల సంఖ్యలో మరణించగా దాదాపు 20 వేల పైచిలుకు మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు.

 Young Boy Arrested For The Doing Coronavirus Prank In Shopping Mall-TeluguStop.com

దీంతో చైనా ప్రభుత్వం వ్యాక్సిన్ కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది.

అయితే కరోనా వైరస్ ని అడ్డుపెట్టుకొని కొంతమంది ఎలాగైనా పాపులర్ అవ్వాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో ఓ యువకుడు తనకు కరోనా వైరస్ సోకింది అంటూ ప్రాంక్ చేస్తూ కటకటాల పాలైన ఘటన అమెరికా దేశంలో చోటు చేసుకుంది.

వివరాలు వివరాల్లోకి వెళితే అమెరికా దేశంలోని ఇల్లినాయిస్ లోని వాల్ మార్ట్ మాల్ నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉంటుంది.

అయితే స్థానిక ప్రాంతానికి చెందిన టువంటి టైరల్ వ్యాలేస్ అనే యువకుడు వాల్ మార్ట్ మాల్ లో తనకు కరోనా వైరస్ సోకిందంటూ ఓ అట్ట ముక్కపై రాసుకొని దానిని వీపు వెనుక వైపు అంటించుకుని షాపింగ్ మాల్ లో లైజాల్ తో ఫ్లోర్ ని క్లీన్ చేస్తూ తిరిగాడు.

  దీంతో అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఒక్కసారిగా అతడిని చూసి ఆందోళనకు గురై అతనికి దూరంగా వెళ్లిపోయారు.దీంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు వెంటనే షాపింగ్ మాల్ కి చేరుకొని టైరల్ వ్యాలేస్ ని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించి విచారించగా తనకి ఎటువంటి కరోనా వైరస్ సోకలేదని తాను ప్రాంక్ చేశానని చెప్పాడు.

 దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి జైలుకి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube