వన్డేల్లో త్రిబుల్ సెంచరీ చేసిన యువ బ్యాట్స్మెన్..!

సాధారణంగా వన్డే సిరీస్ లలో సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ను అందరూ ప్రశంసించడం సర్వసాధారణం.అదే డబుల్ సెంచరీ, త్రిపుల్ సెంచరీ చేస్తే ఆ బ్యాట్స్మెన్ కి వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Luvnith Sisodia Makes Triple Century, Young Batsmen, Score Triple Century, Odis-TeluguStop.com

తాజాగా ఒక యువ బ్యాట్స్మెన్ వన్డే లలో త్రిబుల్ సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ కే సాధ్యం కానీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు ఈ  యువ బ్యాట్స్మెన్.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కర్ణాటక రాష్ట్రం తరఫున లవ్నిత్ సిసోడియా క్రికెట్ ఆడుతున్నాడు.ఇటీవల వన్డే మ్యాచ్లో భాగంగా 129 బాల్స్ లోనే అతడు ఏకంగా తొలి ట్రిపుల్ సెంచరీ ఘనతను సొంతం చేసుకున్నాడు.ఇందులో భాగంగానే ఏకంగా 26 సిక్సలు ఉన్నాయంటే అతడు ఏ విధంగా బ్యాటింగ్ చేశాడో చెప్పనవసరం లేదు.

అయితే ఇది ఐసీసీ, బిసిసిఐ అధికారికంగా నిర్వహించే మ్యాచ్ కాదు.కేవలం ఒక కార్పొరేట్ వన్డే టోర్నమెంట్.

దీంతో లివ్ విత్ ట్రిపుల్ సెంచరీ సాధించిన అనంతరం కూడా ఐసీసీ నుంచి కానీ క్రికెట్ బోర్డు నుంచి కానీ ఎటువంటి గుర్తింపు లభించలేదు.

Telugu Corporate Day, Cricket, Karnataka, Odis, Sayyedmustak, Triple Century, Up

2019, 2020 సంవత్సరంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో కర్ణాటక రాష్ట్ర జట్టు తరఫున లవ్నిత్ సిసోడియా బరిలోకి దిగాడు.అయితే, అక్కడ ఆ సమయంలో పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.కానీ, ఒక మంచి బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్నాడు.

ఈ ఘనత సాధించిన అనంతరం అతడి ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోయింది.ఇదే ఊపుతో తర్వాత నిర్వహించే బిసిసిఐ లేదా ఐసిఐ టోర్నీలో తన సత్తా చాటుతాడో లేదో వేచి ఉండాల్సిందే.

ఇది ఇలా ఉండగా మరోవైపు ఈ బ్యాట్స్మెన్ సాధించిన ఘనతకు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube