అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కుర్ర నటుడు,విషాదంలో ఇండస్ట్రీ

నిండా 30 ఏళ్లు కూడా లేని కుర్ర నటుడు అనుమానాస్పద స్థితి లో కన్నుమూయడం అభిమానులను కలచి వేస్తుంది.ఇంతకీ ఈ ఘటన భారత్ లో చోటుచేసుకోలేదండి.

 Young Actor Cha In Ha Latest Update News-TeluguStop.com

దక్షిణ కొరియా లో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఇటీవల కొరియన్ పాప్ స్టార్ గు హర మృతి చెందిన సంగతి తెలిసిందే.

అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా మరో కొరియన్ నటుడు మృతి చెందడం అందరిని కలచివేస్తుంది.ఇటీవల కాలంలో సౌత్ కొరియా లో వరుసగా కొందరు నటులు,పాప్ స్టార్స్ చనిపోతున్నారు.

అయితే ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా మరేదైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి వరుసగా నటులు మృతి చెందుతూ వస్తున్నారు.తాజాగా సౌత్ కొరియా నటుడు 27 ఏళ్ల ఛా ఇన్ హా అనే నటుడు కూడా అనుమానాస్పద రీతిలో కన్నుమూసినట్లు తెలుస్తుంది.

అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేసారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Telugu Ha, Indianyoung, Korean Ha, Young Ha Latest-

కొరియాలో ‘ది బ్యాంకర్’, ‘లవ్ విత్ ఫ్లాస్’ లాంటి డ్రామా షోలలో నటించాడు ఛా ఇన్ హా.అయితే నిండా 30 ఏళ్లు కూడా లేని ఈ నటుడు మృతి చెందడం తో ఇప్పుడు కొరియన్ సినిమా ఇండస్ట్రీ విషాదం లో మునిగింది.గత ఏడాది కాలంలో అరడజన్ మంది పైగా ఇలా మృత్యువాత పడ్డారు.

అయితే ఆర్టిస్టుల మానసిక పరిస్థితి కారణంగా ఇలా వరుసగా నటులు మృత్యువు ఒడిలో చేరుకుంటున్నారా లేదంటే ఈ మరణాల వెనుక మరేదైనా కారణం ఉందొ తెలియదు కానీ ఈ వరుస మరణాలతో అక్కడి సినిమా ఇండస్ట్రీ తో అభిమానులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube