ఇది చదివిన తర్వాత పానీపూరి తినాలో వద్దో మీరే నిర్ణయించుకోండి...మమ్మల్ని మాత్రం తిట్టుకోవద్దు ప్లీజ్‌  

You\'ll Never Eat Panipuri After Watching The Making-

జనాలు జంక్‌ ఫుడ్‌కు ఈమద్య బాగా అలవాటు పడ్డారు.బయటి తిండికి రుచి ఎక్కువ ఉంటుంది, కాని అది ఎలా తయారు అవుతుందో తెలిస్తే మాత్రం దాన్ని తినలేరని అనుకుంటాం.కాని అలా తయారు అవుతుందని తెలిసి కూడా జనాలు తప్పని సరి పరిస్థితుల్లో, అయిన అలవాటును వదులుకోలేక అదే తింటున్నారు.

You\'ll Never Eat Panipuri After Watching The Making--You'll Never Eat Panipuri After Watching The Making-

రోడ్డు సైడ్‌ హోటల్స్‌ మరియు ఇతర బండ్లమీద తయారు అయ్యే పదార్థాలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తయారు అవుతున్నాయి.అయినా కూడా అవే టేస్టుగా ఉండటంతో పాటు, రేటు తక్కువ అనే ఉద్దేశ్యంతో తింటూ ఉంటారు.

ఇక పానీ పూరి విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పానీ పూరి బండి ఉండని పట్టణం ఉండదు.చిన్న చిన్న ఊర్లలో కూడా ఇప్పుడు పానీ పూరి బండ్లు ఉంటున్నాయి.పానీపూరి బండి వారు ఆ రసంను కలుపుతుంటే అబ్బే అనిపిస్తుంది.అయినా కూడా అవే బాగుంటాయని తింటాం.ఇక పానీ పూరిని తయారు చేసే సమయంలో ఆ పిండిని ఎలా కలుపుతారో తెలిస్తే మాత్రం తిన్నది కూడా బయటకు వచ్చేలా ఉంది.తాజాగా పానీపూరి పిండి కలిపే వారు ఎలా కలుపుతున్నారో కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.

సోషల్‌ మీడియాలో ఇవి తెగ వైరల్‌ అవుతున్నాయి.ఇవి ఎక్కడో తయారు చేస్తున్నారో తెలియదు కాని, అన్ని చోట్ల కూడా దాదాపుగా ఇలాగే తయారు చేస్తూ ఉండవచ్చు అనేది కొందరి వాదన.

ఏదో రుచి కోసం తింటూ ఉంటే మీరు ఇలాంటివి అన్ని చూపించి, పానీపూరిపై అసహ్యం కలిగేలా చేస్తున్నారేంటి, ఇలా అన్ని చోట్ల జరుగుతుంది, తినే ప్రతి పదార్థం ఎంత స్వచ్చంగా ఉందో తెలియదు.అలాంటిది మీరు పానీ పూరి గురించి ఇంత పచ్చిగా రాయడం ఏంటని మమ్ముల తిట్టుకోకండి.

ఇతర పదార్థాల విషయం పక్కన పెడితే పానీ పూరి మొదటి నుండి తినే వరకు అత్యంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి.పూరి పిండి ఇలా కలుపుతారా, ఆ తర్వాత పూరిని ఏ నూనెలో కాల్చుతారో, సరే పూరి అయిన తర్వాత ఏదో రసం తయారు చేస్తాడు, ఆ రసం ఎక్కడిదో, అందులో ఏం ఉంటుందో, ఇక ఏదో పప్పు వేస్తాడు.

అందులో ఏం ఏం వుంటాయో.ఇతర రోడ్‌ సైడ్‌ ఫుడ్స్‌ కంటే ఈ ఫుడ్‌ చాలా ప్రమాదకరం.అందుకే మీరు తిట్టుకునా ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాం, ఆ తర్వాత మీ ఇష్టం.