ఈ 10 ప్రకటనలతో మీరెలా ఫూల్ అవుతున్నారో ఓ సారి చూడండి! కనిపించేదంతా నిజం కాదు.!  

You Won\'t Believe These Clever Tricks Advertisers Use To Fool Us-coll Drink Add,milk Product And Ice Cream,won\'t Believe

 • కనిపించేదంతా నిజం కాదు ఇప్పుడు మనం చూస్తున్న వ్యాపార ప్రకటనలకి సరిగ్గా సరిపోయే మాట ఇది. అడ్వర్టైజ్ మెంట్ల లో మీరు చూసేదేదీ నిజం కాదు. గ్లాసుల్లో నిండే పాలు పాలే కాదు.బుస్సున పొంగే కూల్డ్రింక్ నిజానికి కెమెరాలో అంతభాగా కనిపించదు., ఇక మీరు చూసెస్ పండ్లూ కూరగాయలూ సగానికి సగం నిజంవే కాదు. ఆశ్చర్యపోకండి మనం నిజంగా చూసే వస్తువులన్నీ వ్యాపార ప్రకటనల్లో కనిపించినంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించటానికి కారణం మీరు చూసేవి నిజమైనవి కాదు లేదంటే వాటికి మేకప్ వేసారని అర్థం

 • మరందుకే స్ట్రాబెర్రీ షేక్ చేసేటప్పుడు మీరెంత వెతికినా టీవీలో కనిపించేటంత ఎర్రెర్రని స్ట్రాబెర్రీలు మీకు కిచెన్ లో కనిపించవు.ఇక మరింత చిక్కగా కనిపించే పాలు అస్సలు దొరకవు. ఇంతకీ ఈ అడ్వర్టైజ్ మెంట్ మాయాజాలమేమిటి? అసలు తెరవెనక ఉండి మనకళ్ళకే గంతలు ఎలా కడతారూ అంటే.?

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t

  You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us

 • అడ్వర్టైజ్ మెంత్లో బుస్సుమని పొంగే కూల్డ్రింక్ లోని బుడగలు నిజమైనవి కాదు నిజానికి కూల్డ్రింక్ లో వచ్చే బుడగలు అంత అందంగా కెమెరా కంటికి చిక్కవు.అండుకే ఒక ఆంటాసిడ్ మాత్ర వేస్తారు అందుకే బ్రేవ్ మని తేనుపు వచ్చినట్టు బుస్స్ మంటూ బుడగలొస్తాయ్

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • వంట నూనెల ప్రకటనల్లోనో,ఇంకేదైనా కిచెన్ ప్రోడక్ట్ అడ్వర్టైజ్ మెంట్ లోనో వంటల మీద వచ్చే ఆవిరి పొగలు చూస్తూనే ఆకలి పుట్టిస్తాయి. కానీ ఆ ఆవిర్లన్నీ నిజంవే అనుకుంటే మాత్రం మీరు డోమినోస్ పిజ్జాలో కాలెసినట్టే., ఎందుకంటే ఎక్కువగా పొగలు కనిపించటానికి మీక్కనిపించే బౌల్ వెనకాల మరిగిన నీళ్లలో వేసి తీసిన కాటన్ బాల్స్ ఉంటాయి అంటే మీరు చూసే వంటకానికీ చూసే ఆవిరికీ ఏంబందమూ లేదన్న మాట

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • ఐస్క్రీం ప్రకటనల్లో మీరు చూసేది ఐస్ క్రీం కాదు ఉడకబెట్టి చితగ్గొట్టిన ఆలూ గుజ్జు.షూటింగ్ కోసం వాడే లైట్ల వెలుతురుకి నిజం ఐస్క్రీం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నిర్మొహమాటంగా కరిగి పోతుంది అందుకే ఈ ఆలు మాష్ ఐడియా

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • కే ఎఫ్ సీ చికెన్ వావ్ ఒక్కొక్క పీస్ చూస్తూంటేనే ఇక్కడ నోట్లో నీళ్ళు ఊరతాయ్ నిజంగా తందూరీ ,గ్రిల్డ్ చికెన్ అంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ కానీ మీరు ఇంట్లో గ్రి చేసినా,కనీసం రెస్టారెంట్ లో చూసినా టీవీలో కనిపించినంత పర్ఫెక్ట్ గా కాలినట్టు కనిపించదు. ఎందుకంటే కాలినట్టుగా కనిపించేదంతా షూ పాలీష్ కాబట్టి మొహం అలా పెట్టకండి రెస్టారెంట్ వాడు మరీ అంత ఘోరానికి ఒడిగట్టక పోవచ్చు

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • ఇక డోమినోస్ అడ్వర్టజ్ మెంట్లో కనిపించే బర్గర్లూ పిజాల్లో వాడే వెజిటబుల్స్ అంత ఫ్రెస్ గా క్రిస్బీగా కనిపించటానికి కారణం వాటిని పూర్తిగా వండక పోవటమే ఫ్రెష్ లుక్ కోసం కేవలం అంచుల వద్ద మాత్రమే వాటిని కాస్త అలా వేడి చేస్తారు ఇక పైన ఉంచే బన్ ని అందంగా కనిపించే లా ఫ్రేం సెట్ చేస్కొని చక్కటి షాట్ లాగిస్తాడు కెమెరామెన్

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • వంటలే కాదు ప్రకటనల్లో మనక్కనిపించే పండ్లకూ,కూరగాయలకూ మేకప్ వేస్తారు మీరు చూసే పచ్చని క్యాప్సికం మెరిసిపోతూ కనిపించటానికి దానికి వ్యాక్స్ పూస్తారు ఇక స్ట్రాబెర్రీలూ,యాపిల్స్ మీద లిప్ స్టిక్ రుద్దుతారు మేకప్ మెన్ అంటే మాటలా మరి ఏదనీఅ అందంగా కనిపించేలా చేస్తాడు అందుకే మనింట్లో వాడే కూరగాయలు అందంగా కనిపించవు

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • ఇక మిల్క్ ప్రోడక్ట్స్ లోమీరు చూసే పాలు నిజమైనవి కాదు ఆ మాటకొస్తే అసలవి పాలే కాదు వైట్ పేయింట్ కానీ,సబ్బునురగ కలిపిన నీళ్ళు కానీ వాడతారు అందుకే అంత రంగూ,చిక్కదనం

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • పువ్వులమీద వాలే అందమైన సీతాకోక చిలుక ని ఎప్పుదైనా ఫోటో తీయటానికి ట్రై చేసారా? ఒక్క చోట ఉండకుందా అటూ ఇటూ ఎగురుతుంది కదా! కానీ అడ్వర్టైజ్ మెంట్లో మాత్రం కెమెరా యాంగిల్, లెన్స్ సెట్ చేసుకునే దాకా కదలకుందా బుద్దిగా ఒక్క చోట ఉండటమే కాదు అలా…అలవోకగా రెక్కలార్పుతుంది ఎందుకంటే వాటిని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో ఉంచుతారు దాంతో పాపం అది కాస్త బద్దకంగానూ నెమ్మదిగానూ తయారవుతుంది అదా మత్తులో ఉండగానే షూట్ కానిచ్చేస్తారు

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • ఇక ఐస్ క్యూబ్స్ విశయానికొస్తే మీరింత వరకూ ఏ ప్రకటనలోనూ నిజం ఐస్క్యూబ్ ని చూడనే లేదు ఆశ్చర్య పోకండీ మీరు చూసింది ప్లాస్టిక్ లేదంటే క్రిస్టల్ క్యూబ్ మాత్రమే నిజం ఐస్ క్యూబ్ ది మరీ అంత ఫొటో జెనిక్ ఫేస్ కాదు అందుకే ఇలా డూప్ లతో పని కానిచ్చేస్తారు

 • You Won't Believe These Clever Tricks Advertisers Use To Fool Us-Coll Drink Add Milk Product And Ice Cream Won\'t
 • దియోడరెంట్ స్ప్రే చేస్కునేది మీరే కాదు గాజు గ్లాసులకూ బాడీ స్ప్రే అవసరమే…. మరి! ఆడ్ లో శీతల పానీయం ఉన్న గ్లాస్ మీద కనిపించే… నాచురల్ స్నో ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? అదీ మీరు రోజూ వాడే బాడీ స్ప్రేనే….

 • ఇదండీ సంగతి.! అందుకే కంటికి కనిపించేదంతా నిజం కాదూ అన్నారు పెద్దల మరదే.! కెమెరా కంటితో చూపించేదంతా అబద్దం అనికాదు అర్థం చేసుకోవాల్సింది., అడ్వర్టైజ్ మెంట్లలో మిమ్మల్ని మాయ చేసి బుట్టలో వేయటానికి ఎంత మంది ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తారో అర్థం చేసుకోండీ