బాబోయ్.. ఆ ఊరిలో ఉండాలంటే బాడీలో ఆ పార్ట్ ఉండకూడదట..!

ఏదైనా ప్రదేశంలో జీవించాలంటే మన శరీరంలో ఉన్న భాగాలను తొలగించు కోవాలని మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఇలాంటి ఆచారం ఒకటి ఉంటుందని కూడా మనకు తెలియదు.కానీ ఒక ఊరిలో ఇలాంటి ఆచారం ఉంది.

 You Will Need A Mandatory Appendix Removal Operation To Live In This Town, Villa-TeluguStop.com

ఆ ఊరిలో మనం వెళ్లి నివసించాలంటే ఈ రూల్ పాటించాల్సిందే నట.మరి ఆ ఊరు ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా.

మనం ఈ ప్రపంచంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంద మనం చేయాల్సిందల్లా కేవలం అక్కడ ఆచారాలను, పద్దతులను పాటిస్తే చాలు.కానీ కొన్ని ప్రాంతాల్లో ఆచర్యలు చాలా వింతగా ఉంటాయి.

వాటిని వింటేనే మనం ఆశ్చర్య పోవడం ఖాయం.మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రదేశంలో కూడా ఒక వింత ఆచారం ఉంది.

అక్కడ నివసించాలంటే మనం శరీరంలో ఒక భాగాన్ని తొలగించు కోవాల్సిందే.

అంటార్కిటిక్ లోని విల్లా లాస్ ఎస్టర్లస్ అనే ఊరులో ఆచరించే పద్ధతి ఇది.ఆ ఊరులో ఎవరైనా నివసించాలంటే ఒక పార్ట్ ను తొలగించుకోవాల్సిందే.ఆ సర్టిఫికెట్ చూపిస్తేనే ఆ ఊరులో ఉండేందుకు ఒప్పుకుంటారు.

ఇంతకీ ఏం పార్ట్ అని ఆలోచిస్తున్నారా.అక్కడ ఉండాలనుకునే వారు మీ శరీరంలో ఉన్న అపెండిక్స్ ను తప్పనిసరిగా తొలగించు కోవాలట.

Telugu Remove Appendix, Villalas-Latest News - Telugu

అందుకు కారణం కూడా వారు చెబుతున్నారు.ఎందుకంటే.అక్కడ వైద్య సదుపాయాలు ఉండవట.ఆ ఊరులో కేవలం 150 మంది మాత్రమే నివసిస్తున్నారు.ఆ పట్టణం మొత్తం 14, 970 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది.ఈ పట్టణం నుండి 1000 కిలో మీటర్ల దూరంలో ఒక హాస్పిటల్ ఉందట.

Telugu Remove Appendix, Villalas-Latest News - Telugu

అందుకే ఎవరికైనా అపెండిసైటిస్ వస్తే ఆసుపత్రికి వెళ్లే లోపే ప్రాణాలు పోతాయని అందుకే వారు ఊరులో నివసించాలంటే తప్పకుండ అపెండిక్స్ తొలగించాలనే రూల్ పెట్టుకున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం ఆ ఊరులో రెండు పడకలతో ఒక ఆసుపత్రి, ఒక డెంటల్ క్లినిక్ మాత్రమే ఉన్నాయట.వీళ్ళు ఈ రూల్ ను 2018 నుండి అమలు చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube