కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి తెలుసుకుంటే షాకవడం ఖాయం.. ?

ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజకీయాల్లో నీతివంతులైన నాయకులు ఉండాలన్నది నియమం.కానీ నేటి రాజకీయాలు గుండాయిజానికి, దౌర్జన్యాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లా మారుతున్నాయి.

 You Will Get Shocked If You Know The Criminal Background Of Kerala Assembly Elections Contesting Candidates-TeluguStop.com

ప్రభుత్వ ఉద్యోగాలకు నేర చరిత్ర లేని వారిని ఎంపిక చేసుకుంటారు.కానీ ప్రభుత్వాన్ని నడిపే వారికి ఎంత నేర చరిత్ర ఉన్న ఫర్వాలేదు.

పెద్ద పెద్ద స్కాంలు చేసినా శిక్షలు ఉండవు.ప్రస్తుతం లోకంలో నడుస్తున్న తీరు ఇదే.

 You Will Get Shocked If You Know The Criminal Background Of Kerala Assembly Elections Contesting Candidates-కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి తెలుసుకుంటే షాకవడం ఖాయం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దుల చరిత్ర గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ రిపోర్ట్ తయారు చేసింది.ఆ రిపోర్ట్ లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈమేరకు ఏప్రిల్ 6న కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.ఈ క్రమంలో ఏడీఆర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 132 మంది సిట్టింగ్ స్థానాల అభ్యర్ధుల్లో 86 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు, 28 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు, ఇద్దరు ఎమ్మెల్యేలపై మర్డర్ కేసులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై మర్డర్ అటెంప్ట్ కేసులు, ఒక ఎమ్మెల్యేపై మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించినందకు గాను క్రిమినల్ కేసులు నమోదయ్యాయట.

అదే స్థాయిలో కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ లో తేలిందట.ఇక కేరళలో ఉన్న 132మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 57మంది కోటీశ్వరులున్నట్లు తెలుస్తోంది.మరి ఇలాంటి వారు గెలిచాక ప్రజలకు ఏం సేవచేస్తారో.?

.

#AssociationFor #Criminal Cases #Kerala #ADR Report #Millionaires

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు