దేవుడా: ఈ మొక్కను తాకారో ప్రాణం పోవడం ఖాయం..!

ప్రకృతిలో ప్రాణాల్ని క్షణాల్లోనే తీసే ఎన్నో భయంకరమైన జీవరాశులతో పాటు మొక్కలు కూడా ఉంటాయి.అత్యంత విషపూరితమైన పాములు కంటే మరింత విషపూరితమైన మొక్కలు ఈ భూమ్మీద ఉన్నాయంటే నమ్ముతారా? పొరపాటున ఆ మొక్కలను తాకితే.శరీరం పై బొబ్బలు ఎక్కి యాసిడ్ కంటే విపరీతమైన నొప్పిని కలిగిస్తూ చివరికి ప్రాణాలను సైతం హరించేస్తాయి.కొన్ని మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.వాటికి తెల్లనిపువ్వులు కూడా ఉంటాయి.అటువంటి చెట్లు విషపూరితమైనవని ఎవరూ అనుకోరు.

 You Will Die If You Touch Poisonous Hogweed Plant , Plant, Touch, Died, Be Caref-TeluguStop.com

అలా మోసపోయి ఎవరైతే ఆ మొక్కలను ముట్టుకుంటారో వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.చాలా ఏళ్ళ క్రితం ఒక విదేశీ సైనికుడు మలమూత్రాల శుభ్రం చేసుకోవడానికి ఒక ఆకుతో తుడుచుకున్నారు.

దీంతో కొద్ది క్షణాల్లోనే అతడికి తీవ్రమైన మంట పుట్టి.ఆ నొప్పి భరించలేక బుల్లెట్ తో కాల్చుకుని చనిపోయారు.

ఐతే ఈ ఆర్టికల్ లో అందంగా కనిపించే ఒక అత్యంత ప్రమాదకరమైన మొక్క గురించి తెలుసుకుందాం.బ్రిటన్ లో అత్యంత ప్రమాదకారిగా పేరు తెచ్చుకున్న హాగ్‌వీడ్‌ మొక్క మనిషి శరీరానికి తగిలితే చాలు.

దానిలోని విషపూరితమైన ద్రవాలను శరీరం లోపలకి పంపించి నిమిషాల వ్యవధిలోనే శరీరం మొత్తాన్ని తగలబెడుతుంది.ఒకవేళ ఈ మొక్క ఎక్కువగా చర్మానికి మొక్క తాకినట్లయితే.శరీరంపై తీవ్రమైన బొబ్బలు రావడం తో పాటు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Telugu Acid, Craefull, Britain, Carbon, Hog Weed, Oxygen, Touch-Latest News - Te

అయితే ఈ మొక్కను తాగితే తీవ్ర అనారోగ్యం పాలవడం తో పాటు మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట.పాము విషం కంటే విషపూరితమైన ఈ మొక్కలకు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.హాగ్‌వీడ్‌ మొక్కల్లో సెన్సింగ్ ఫ్యూరానోకౌమరిన్స్ అనే ఓ కెమికల్ ఉంటుంది.

ఈ కెమికల్ వలన మనిషి శరీరం యాసిడ్ తో కాల్చినట్టు కాలిపోతుంది.అయితే ఈ మొక్కలు ప్రమాదకరమైనవే కానీ వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో బాగా దోహదపడతాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube