దేశంలో పంజా విసురుతున్న కరోనా.. కొత్త కేసుల సంఖ్య చూస్తే వస్తుంది గాబరా.. !

దేశంలో పరిస్దితులు మళ్లీ చేయి జారేదిశగా వెళ్లుతున్నాయా అంటే అర్ధం కానీ ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటాయి.కానీ కొన్ని రాష్ట్రాల పరిస్దితులను చూస్తుంటే అక్కడి ప్రజలతో కరోనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిందనిపిస్తుంది.

 India, New Corona, Covid 19, Cases-TeluguStop.com

ఇప్పటికే రెడ్ జోన్, లాక్‌డౌన్ వంటి పదాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలను కట్టడి చేస్తారా అనే భయం కొందరిలో కలుగుతుండగా పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది.

అదేమంటే దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య మ‌ళ్లీ 26 వేలు దాటిందంటున్నారు.కాగా గత 24 గంటల్లో 26,291 మందికి కరోనా నిర్ధారణ అయిందన్న విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

వీరి వివరాల ప్రకారం చూస్తే.దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,85,339కు చేరుకోగా, ఈ మహమ్మారి నుండి 17,455 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.

ఇక ఈ 24 గంట‌ల సమయంలో 118 మంది కరోనా కారణంగా మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,58,725 కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube