క్వీన్ ఎలిజబెత్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యేవారో తెలిస్తే అవాక్కవుతారంతే!

బ్రిటన్ రాజవంశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు మహారాణిగా కొనసాగిన ఎలిజబెత్-2 వృద్ధాప్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు.ఆమె 70 సంవత్సరాల 214 రోజుల పాటు పాలన సాగించి చరిత్ర సృష్టించారు.96 ఏళ్లపాటు ఎంతో ఆరోగ్యంగా జీవించిన ఎలిజబెత్ హెల్త్ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాలని ఇప్పుడు చాలామంది ఆరా తీస్తున్నారు.మరి మనం కూడా ఆమె ఏం తినేవారో తెలుసుకుందాం పదండి.

 You Will Be Surprised To Know What Kind Of Diet Queen Elizabeth Used To Follow,-TeluguStop.com

క్వీన్ ఎలిజబెత్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి బకింగ్‌హామ్ ప్యాలస్‌లోనే దాదాపు 20 మంది చెఫ్‌లు ఉండేవారు.ఆమె ఇష్టానికి తగినట్లుగా వీరు ఫుడ్స్ తయారు చేసేవారు.

ఈ వంట తయారీలో క్రీ.శ.1800 నాటి పాత్రలు వాడేవారు.ఎలిజిబెత్ బ్రేక్‌ఫాస్ట్‌లో టీ, బిస్కెట్లు తీసుకునేవారు.రోజూ పొద్దున్నే 7:30 గంటలకు ఒక కప్పు ఎర్ల్ గ్రే టీ, మరో కప్పులో వేడినీరు తీసుకెళ్లేవారు.‘ఎర్ల్ గ్రే’ టీలో బేరిపండు, నారింజ తొక్కల నుంచి తీసిన ఆయిన్‌ను వాడతారు.తర్వాత కొంచెం పాలు మిక్స్ చేసి తయారు చేస్తారు.ఇందులో షుగర్ మాత్రం అస్సలు కలపరు.ఇక ఈ రాణి చాక్లెట్ ఆలివర్స్ బిస్కెట్ చాలా ఇష్టంగా తినేవారు.అస్సాంకి చెందిన ‘సిల్వర్ టిప్స్ చాయ్’ని కూడా ఆమె అమితంగా ఇష్టపడేవారు.

ఎలిజబెత్ ఉదయం 8:30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రెష్ ఫ్రూట్స్‌, తృణధాన్యాలు ఆహారంగా ఆరగించేవారు.ఆమె అధికంగా మామ్లెట్ లేదా ఆరెంజ్ మార్మాలాడే, టోస్ట్‌ని తినేవారు.

ఒక్కోసారి సాల్మన్ చేపలు, బ్రౌన్ కలర్ గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌గా లాగించేవారు.తన డైలీ డైట్‌లో చేపలు, కూరగాయలు చాలా ఎక్కువగా ఉండేలా రాణి చూసుకునేవారు.

అయితే ఎంత తిన్నా తరగని ఆస్తి ఉన్నా కూడా ఆమె చాలా మితంగానే తినేవారట.

ఇక మధ్యాహ్నం సమయంలో లంచ్‌ మీల్‌గా బచ్చలికూర, గుమ్మడికాయ, పాలకూర, కీరాదోసతో చేసిన రుచికరమైన రెసిపీలు తీసుకునేవారు.

మాంసాహారం తినాలనిపిస్తే సలాడ్‌తో పాటు గ్రిల్డ్ చికెన్, చేపలు ఎంచుకునేవారు.అప్పుడప్పుడు ఎర్ల్ గ్రే టీ కూడా తాగేవారు.దోసకాయ శాండ్‌విచ్‌లు, ఫ్రూట్ కేక్‌లు, టమోటా శాండ్‌విచ్‌లు, జామ్ పెన్నే శాండ్‌విచ్‌లను ఆమె గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు.బ్రెడ్‌పై బటర్, స్ట్రాబెర్రీ జామ్‌తో వేసుకుని దాన్ని శాండ్‌విచ్‌గా తినడానికి ఈమె బాగా ఇష్టపడేవారు.

ఇక డిన్నర్ టైమ్‌లో ఈ దివంగత బ్రిటన్ మహారాణి చేపలు, కూరగాయలు, సలాడ్ మాత్రమే తినేవారు.స్వీట్లు కూడా ఆమె అప్పుడప్పుడు తినేవారు.ఈమె తన 95 ఏళ్లు వచ్చేవరకు వైన్ తాగారట.పొద్దున్నే ఒక జిన్ కాక్‌టెయిల్‌ తీసుకునే అలవాటు ఆమెకు ఉంది.మళ్లీ పగటి సమయంలో భోజనం చేసేటప్పుడు గ్లాస్‌ వైన్ లేదా షాంపైన్ తాగేవారు.ఈవెనింగ్ టైమ్‌లో మరో గ్లాసు షాంపైన్, డ్రై మార్టినీ తీసుకునేవారు.

ఒక్కోసారి సాయంత్రం వేళలో భోజనాలతో పాటు స్వీట్ వైన్ సేవించేవారు.ఇలా చాలా లైట్ ఫుడ్ తింటూ ఆమె తన ఆరోగ్యాన్ని చివరి వరకు కాపాడుకోగలిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube