ఈ నియంతల ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవుతారు..!

రాజుల కాలం అంతమయ్యాక కొన్ని దేశాల్లో నియంతలు దేశాధినేతలయ్యారు.ఇదే మా శాసనమంటూ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనంటూ కఠిన ఆంక్షలు విధించారు.

 You Will Be Shocked By Knowing The Food Habits Of These Dictators Details, Foo-TeluguStop.com

ఏకచక్ర ఆధిపత్యం వహిస్తూ తమ నియమాలను అతిక్రమించిన సామాన్యులకు ఘోరమైన శిక్షలు విధించారు.అయితే సామాన్యుల పట్ల ఘోరంగా వ్యవహరించిన వీరు తమ వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు.

ముఖ్యంగా ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు.మరి ఈ నియంతలు ఎలాంటి ఆహారం తీసుకునేవారు? వారి ఆహారపుటలవాట్లు ఏంటి? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.అడాల్ఫ్‌ హిట్లర్‌:

Telugu Adolf Hitler, Eedi Ameen, Habits, Georgia, Germany, Joseph Stalin, Kim Jo

అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ దేశాన్ని పరిపాలించిన సంగతి తెలిసిందే.ఇతడి పరిపాలనలో కోటి దాకా ప్రజలు అత్యంత దారుణంగా చంపబడ్డారని అంటుంటారు.హిట్లర్ క్రూరమైన వ్యక్తి అయినప్పటికీ.

మూగ జంతువుల పట్ల అమితమైన ప్రేమ చూపించేవారు.అందుకే తన జీవితాంతం ఏ జంతువుని చంపకుండా వాటి మాంసం తినకుండా శాకాహారిగానే జీవించారు.

శాకాహారంలో బంగాళదుంప పులుసు, బంగాళదుంప కూర, మెదిపిన బంగాళాదుంపలు అంటే హిట్లర్‌కు మహా ఇష్టం.దీర్ఘకాలిక అపానవాయువు, మలబద్దకం సమస్యలతో హిట్లర్ బాధపడేవారు.

అయితే బంగాళదుంప పులుసు తింటే ఆ సమస్యలు తగ్గుతాయని అతను నమ్మేవారు.అందుకే బంగాళా దుంప పులుసు ప్రతిరోజూ ఆరగించేవారు.

అయితే ఫుడ్ తీసుకునే ప్రతిసారీ 15 మంది హిట్లర్ తినబోయే ఫుడ్ టెస్ట్ చేసేవారు.ఈ ఫుడ్ టెస్టర్లు ఫుడ్ టెస్ట్ చేసిన 45 నిమిషాలు తరువాత హిట్లర్ ఫుడ్ తినేవారు.ఆహారంలో విషం కలిసిందో లేదో తెలుసుకునేందుకు ఇలా చేసేవారు.

2.జోసెఫ్‌ స్టాలిన్‌

Telugu Adolf Hitler, Eedi Ameen, Habits, Georgia, Germany, Joseph Stalin, Kim Jo

సోవియట్‌లో నియంతృత్వ పరిపాలన సాగించిన ఉక్కుమనిషి జోసెఫ్‌ స్టాలిన్‌ జార్జియాకు చెందిన వారు.అందుకే స్టాలిన్‌ జార్జియా సంప్రదాయ వంటకాలను ఎక్కువగా ఇష్టపడేవారు.ముఖ్యంగా వెల్లుల్లి, వాల్‌నట్స్‌, రేగు పండ్లు, దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకునేవారు.క్యాబేజి సూప్, తాజా చేపలు, గొర్రె కబాబ్ కూడా ఇష్టంగా తినేవారు.అయితే భోజనం చేసేటప్పుడు స్టాలిన్‌ చాలా ఎంజాయ్ చేస్తారట.ఆడుతూ పాడుతూ తినడం అంటే స్టాలిన్‌కు చాలా ఇష్టం.దాదాపు 8 గంటలపాటు స్టాలిన్‌ ఆహారం తిన్న సందర్భాలూ ఉన్నాయని అంటున్నారు.

3.ఈదీ అమీన్‌

Telugu Adolf Hitler, Eedi Ameen, Habits, Georgia, Germany, Joseph Stalin, Kim Jo

అత్యంత కిరాతక నియంత అయిన ఈదీ అమీన్ ఉగాండా దేశాన్ని 1971 నుంచి 1979 వరకు పరిపాలించారు.సైనిక అధికారిగా పనిచేసిన ఇతడు అధ్యక్షుని పదవిని అధిష్టించి అనేక క్రూరమైన పనులు చేశారు.తర్వాత పదవి కోల్పోయి సౌదీలో తలదాచుకున్నారు.ఇక్కడ జీవించినంత కాలం అమీన్‌ ప్రతిరోజూ 40 బత్తాయి పండ్లు, కేఎఫ్‌సీ చికెన్‌ ఆరగించేవారు.మధ్యాహ్నం కాగానే టీ తాగకపోతే అతనికి రోజు గడవకపోయేది.విస్తుపోయే అంశం ఏంటంటే అతడు నర మాంసం కూడా భక్షించేవారట.అయితే ఇవి కేవలం వదంతులే అని కొట్టిపారేసేవారు లేకపోలేదు.

4.కిమ్‌ జోంగ్‌ ఇల్‌

Telugu Adolf Hitler, Eedi Ameen, Habits, Georgia, Germany, Joseph Stalin, Kim Jo

ఉత్తర కొరియా దేశంలో కింగ్ కుటుంబం నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది.కిమ్ కుటుంబంలో రెండో తరానికి చెందినవాడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌.ఇతడు సొర చేపల రెక్కలతో చేసిన సూప్‌, శునకం మాంసంతో చేసిన సూప్‌ అమితంగా తినేవాడు.ఈ సూప్ లు రోగనిరోధకశక్తిని పెంచుతాయని అతడు నమ్మేవాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube