పురాతన కాలం నాటి వస్తువుకు వేలంలో పలికిన ధరను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా, ఓల్డ్ కాలం నాటి వస్తువులంటే చాలా మందికి ఆసక్తి మాత్రమే కాదు ప్రేమ కూడా.

 You Will Be Amazed To See The Auctioned Price For An Antique Item-TeluguStop.com

అయితే, పురాతాన కాలం నాటి వస్తువులను చూస్తే మీరు కూడా అదేరకంగా ప్రేమ పెంచుకుంటుంటారు.కాగా, పురాతన కాలం నాటి వస్తువులు దొరకడం అరుదు.

కాగా, ఆ కాలానికి సంబంధించిన వస్తువు ఒక దానికి వేలం పాటలో భారీ ధర లభించింది.అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

 You Will Be Amazed To See The Auctioned Price For An Antique Item-పురాతన కాలం నాటి వస్తువుకు వేలంలో పలికిన ధరను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

40 ఏళ్ల కిందట అనగా సుమారు 1981 కాలంలో ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా తయారు చేసిన కేక్‌ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు.వారి మ్యారేజ్ సందర్భంగా వచ్చిన గిఫ్ట్స్‌లోని ఓ దాని ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు.

ఈ కేకుపై జూలై 29, 1981 అని డేట్‌ రాసి ఉందట.కాగా, వెరీ స్మూత్‌గా ఉంటుందని అంటున్నారు పలువురు.బ్రిటన్ రాణి డయానా పెళ్లి కేకు తప్పక దక్కించుకోవాల్సిందేనని కొంత మంది అనుకుంటున్నారు.ఈ కేకు ఆకర్షణీయంగా అలంకరించబడింది.

దీనిపై రెడ్, బంగారం, నీలం, వెండి రంగులు ఉన్నాయి.ఈ కేక్ ముక్కను క్లారెన్స్ హౌజ్‌లో భద్రపరిచారు.

పూల కేక్ టిన్‌లో సురక్షితంగా బ్రిటన్ రాణి తల్లి మొయిరా స్మిత్ భద్రపరిచినట్లు చరిత్ర పేర్కొంటున్నది.స్మిత్‌ కుటుంబీకులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు.

ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు.తాజాగా మరోసారి వేలం పాటలో అమ్మబోతున్నారు.

కాగా, కేక్ ముక్కకు మూడొందల నుంచి ఐదొందల పౌండ్ల ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.ఆక్షన్ వేసే సభ్యుడు ఒకతను మాట్లాడుతూ కేక్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, కేక్ ముక్క అమ్మినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అలానే తాజాగా ఉందని చెప్తున్నారు.

అయితే, పొరపాటున కూడా అస్సలు తినొద్దని చెప్తుండటం గమనార్హం.

#Piece Of Cake #Cake #YouWill #Olden Days

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు