జవాన్ ను చుసి ఆ బుడ్డోడు చేసిన పని తెలిస్తే నిజంగా శభాష్ అనాల్సిందే..!

You Will Appreciate This Kid Has Done By Seeing A Soldier

దేశాన్ని కాపాడే సైనికులకు మనం ఎంత చేసినా, ఏమి ఇచ్చినా తక్కువే అని చెప్పాలి.ఎందుకంటే రాత్రి, పగలు అనే తేడా లేకుండా దేశ ప్రజలను కాపాడడం కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు.

 You Will Appreciate This Kid Has Done By Seeing A Soldier-TeluguStop.com

కానీ మనం జవాన్ల కష్టాన్ని గుర్తించము.వారు ప్రాణాలను తెగించి మరి మనల్ని కంటికిరెప్పలా కాపాడుతున్నారు.

వాళ్ళ విలువ మనకి ఎప్పటికి తెలియదు.కానీ.

 You Will Appreciate This Kid Has Done By Seeing A Soldier-జవాన్ ను చుసి ఆ బుడ్డోడు చేసిన పని తెలిస్తే నిజంగా శభాష్ అనాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుడ్డోడు మాత్రం వయసులో చిన్నవాడు అయిన జవాన్ల చేసే కృషిని గుర్తించాడు.ప్రస్తుతం ఈ బుడ్డోడుకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ చిన్నోడు చేసిన పని చూసి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.అంతలా ఆ బుడ్డోడు ఏమి చేసాడో తెలియాలంటే ఈ వైరల్ వీడియో చుడాలిసిందే.

అసలు వివరాల్లోకి వెళితే.బెంగళూరుకు చెందిన అర్జున్ అనే వ్యక్తి ఈ నెల 24న తన నాలుగేళ్ల కుమారుడు వీర్‌ తో కలిసి ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లాడు.

ఇలా వీర్ తన తండ్రి చేతిని పట్టుకుని ఎయిర్‌ పోర్ట్‌ కు వస్తూ పోతున్న వాహనాలను చూస్తూ ఉన్నాడు.ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఆర్మీ వాహనం ఒకటి ఆ చిన్నోడి కంట పడింది.

అలాగే ఆర్మీ వాహనంలో ఒక జవాన్ నిల్చొని ఉండటాన్ని చూసాడు.ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీర్ తన తండ్రి చేతిని వదిలిపెట్టేసాడు.

వీర్ అలా ఎందుకు చేస్తున్నాడో ఏమో ఎవరికీ అర్ధం కాలేదు.

ఆ తర్వాత వీర్ చేసిన పని చూసి అక్కడ ఉన్న అందరు షాక్ అయ్యారు.వీర్ ఎప్పుడయితే వాహనంలో ఉన్న ఆర్మీ జావాన్‌ ను చూసాడో అప్పుడు తన తండ్రి చేయి విడిచిపెట్టి అక్కడ ఉన్న జవాన్ కి సెల్యూట్ చేశాడు.వీర్‌ ను చూసిన ఆ ఆర్మీ జవాన్ కూడా సెల్యూట్‌ కు బదులుగా వీర్ కు ప్రతి సెల్యూట్ చేశారు.ఈ వీడియోను అర్జున్.‘ఇండియన్ ఆర్మీ మన నిజమైన హీరోలు’ అనే క్యాప్షన్‌ తో ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు.ఈ వీడియోను చుసిన నెటిజన్లు ఆ పిల్లాడు చేసిన పని చూసి ఫిదా అయిపోతున్నారు.

#Salute Soldier #Bangalore #Air Port #Arjun #Veer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube