ఇకపై యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఉండవట

యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే చాలు ఏదో ఆసక్తి రేకెత్తించే థమ్‌నైల్‌తో టైటిల్‌తో వీడియో ఉంటుంది.తీరా ఆ వీడియోను ఓపెన్‌ చేస్తే మ్యాటర్‌ ఏమీ ఉండదు.

 You Tube Officials Take The Sensational Decission About Videos-TeluguStop.com

మొదట ఇలాంటి వీడియోలను ఎక్కువ మంది చూసేవారు.కాని మొత్తం అవ్వే అవుతున్న కారణంగా ఆ వీడియోలను నమ్మడమే జనాలు మానేశారు.

అలాంటి ఫేక్‌ టైటిల్స్‌ వల్ల జనాలు చిరాకు పడుతున్నారనుకుంటున్న యూట్యూబ్‌ యాజమాన్యం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.ఆ నిర్ణయంతో ఇకపై అలాంటి పుల్కా వార్తలు ఉండబోవు.

యూట్యూబ్‌ వారు భాషకు ఒక టీం తయారు చేసి పెద్ద ఎత్తున యూట్యూబ్‌లో పోస్ట అవుతున్న వీడియోలపై పర్యవేక్షణ పెట్టబోతుంది.టైటిల్‌ మరియు వీడియోకు సంబంధం లేకున్నా లేదంటే పుకారును క్రియేట్‌ చేసినా కూడా ఆ వీడియోను వెంటనే తొలగించడంతో పాటు ఆ వీడియో క్రియేటర్‌కు వార్నింగ్‌ మెసేజ్‌ను పంపించబోతున్నారు.

యూట్యూబ్‌లోని కంటెంట్‌ను నమ్మశక్యంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా యూట్యూబ్‌ ఇండియా ప్రతినిధి అన్నారు.ఇకపై యూట్యూబ్‌లో జన్యూన్‌ కంటెంట్‌ మాత్రమే ఉండబోతుందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube