ఫన్ బకెట్ భార్గవి : ఆ నిర్మాత అవకాశం పేరుతో పిలిచి నాతో అలా...

మామూలుగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉండడం సహజమేనని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇందులో కొందరు అవకాశాల కోసం సర్దుకుపోతూ ఉంటే మరి కొందరు మాత్రం నిర్మొహమాటంగా నో చెబుతూ వారి గురించి మీడియా ముందుకు వచ్చి మరీ తాము ఎదుర్కొన్న టువంటి సంఘటనల గురించి చెబుతూ నూతన నటీనటులకు ఈ క్యస్టింగ్ కౌచ్  కల్పిస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు.

 Fun Bucket Comments On Casting Couch,bhargavi, Fun Bucket, Youtube Comedy Show,-TeluguStop.com

తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య పై యూట్యూబ్ లో ఫన్ బకెట్ అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరించిన భార్గవి స్పందించింది. ఇందులో భాగంగా తాను సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న ఓ క్యాస్టింగ్ కౌచ్ ఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

కాగా తాను మొదట్లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని కానీ ఆ చిత్ర నిర్మాత తనని మాట్లాడాలని తన ఆఫీసుకి పిలిచాడని, ఈ క్రమంలో  పరోక్షంగా తన ఉద్దేశాన్ని వెల్లడిస్తూ మత్తు మందు కలిపిన డ్రింక్స్ ని తన చేత తాగించాలని ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.దాంతో విషయం అర్థం చేసుకొని ఫోన్ మాట్లాడుతున్నట్లు నటించి అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది.

దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు తనని కమిట్మెంట్ అడిగిన ఆ సినీ నిర్మాత ఎవరో తెలియజేయాలని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేగాక అలాంటి వారి పేర్లు బయట పెట్టడం వల్ల నటీ నటులు వారికి కొంత మేర దూరంగా ఉంటారని అలాగే ఎంతో మేలు చేసిన వారవుతారని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube