ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనకు పాల్పడుతూ హెల్మెట్ ధరించకుండా పూర్తి నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతూ తమ ప్రాణాలనే కాక ఇతరుల ప్రాణాలను బలిగొల్పుతున్నారు.
ఇలా జరిగే ప్రమాదాలలో ఎక్కువగా జరిగేది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం ద్వారానే అని పోలీసుల నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే.అయితే పోలీసులు ప్రతి సారి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించవద్దని పలు మార్లు సూచిస్తూనే ఉన్నారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ఎంత ప్రమాదమో వాహనదారులకు తెలియకపోవడంతో యధేచ్చగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.
అయితే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేయండి.ఈ వీడియోను నిశితంగా గమనిస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందని, ఇంట్లో మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తారని, మనం ఇలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి కాకుండా చూసుకొనే భాధ్యత మన మీద ఉందని, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు కాల్ వస్తే రోడ్డు నుండి ఒక ప్రక్కకు వచ్చి, వాహనాన్ని ఆపి ఫోన్ లో మాట్లాడాలని, తరువాత తిరిగి ప్రయాణం ప్రారంభించాలని పోలీసులు చెబుతున్నారు.ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్ పై పోలీసులు విడుదల చేసిన వీడియో.
మీ కోసం.వీక్షించండి.