మీ యాప్​స్టోర్లలో ఈ యాప్​లే ఉండాలి.. లేదంటే దబిడిదిబిడే!

రోజురోజుకీ టెక్నాలజీని అడ్డగోలుగా వాడుకొని అడ్డదారుల్లో డబ్బు సంపాదించే కేటుగాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది.ఈ మేరకు ఎలక్ట్రానిక్స్​ అండ్ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మినిస్ట్రీ, రిజర్వ్​ బ్యాంక్​ అనుమతి పొందిన డిజిటల్ లెండింగ్ యాప్స్​ మాత్రమే ఉండాలని యాప్​ స్టోర్లవారిని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 You Should Have These Apps In Your App Stores Otherwise It Will Be Crowded, Appl-TeluguStop.com

ఈ విషయమై ఫైనాన్స్​ మినిస్ట్రీ పార్లమెంట్​కు మంగళవారం ఓ వినతిపత్రం అందించింది.చైనా లింకులతో నడుపుతున్న 58 యాప్స్​ను ఎలక్ట్రానిక్స్​ అండ్ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మినిస్ట్రీ తాజాగా గుర్తించింది.

దీంతో వాటిని బ్లాక్​ చేయాలని యాప్​ స్టోర్లను ఆదేశించింది.

Telugu Download, Latest, Ups-Latest News - Telugu

ఈ క్రమంలోనే రిజర్వ్​ బ్యాంక్ అనుమతి లేని యాప్స్​ను యాప్​స్టోర్ల నుంచి తొలగించాలని ఈమధ్యనే వారికి సూచించింది.కాగా ఈ ఆదేశాలను గూగుల్​ రివ్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.మనీలాండరింగ్​కు అవకాశం లేని విధంగా యాప్స్​ ఉండాలని, కస్టమర్ల ఐడెంటిఫికేషన్​ కోసం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలని కూడా బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్స్​కు రిజర్వ్​ బ్యాంక్​ సూచించినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ పార్లమెంట్​లో తెలపడం విశేషం.

Telugu Download, Latest, Ups-Latest News - Telugu

ఇకపోతే అకౌంట్ల ఓపెన్ చేయడంతో పాటుగా వాటిని మానిటరింగ్​ కూడా చేయాలని రిజర్వ్​ బ్యాంకు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్స్​కు సలహా ఇచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.లోన్​ సర్వీస్​ ప్రొవైడర్ల డ్యూ డెలిజన్స్​ కోసం సెప్టెంబర్​ 2022 లోనే రిజర్వ్​ బ్యాంక్ గైడ్​లైన్స్​ను జారీ చేసిన సంగతి తెలిసినదే.లెండర్​ బ్యాంక్​ అకౌంట్​ నుంచి నేరుగా బారోవర్​ అకౌంట్​కి అంటే మధ్యలో ఎలాంటి థర్డ్​పార్టీ లేకుండా చేరేలా కొత్త రూల్స్​ తీసుకొచ్చింది.ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒకచోట ఎలాంటి యాప్స్ కారణంగా అభంశుభం తెలియని అమాయకులు బలవుతున్నారు.

ఈ తరుణంలో కేంద్ర ప్రతిభుత్వం తీసుకొస్తున్న మార్పులు హర్షణీయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube