ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకోకుంటే జీవితమే వృదా... తెలంగాణ అసెంబ్లీలో ఇతడు హోంగార్డ్‌

సాయం చేసే మంచి మనసు ఉండేలే కాని ఏ రకంగానైనా సాయం చేయవచ్చు.చాలా మంది నా వద్ద డబ్బు ఉంది కాని సాయం చేసేందుకు సమయం లేదని అంటారు.

 You Must Know About The Home Guard In Telangana Assembly-TeluguStop.com

మరి కొందరు నాకు సాయం చేసేందుకు సమయం ఉంది, మంచి మనసు ఉంది కాని నా వద్ద డబ్బులు మాత్రం లేవు అంటారు.డబ్బులు లేనంత మాత్రాన సాయం చేయకుండా ఉండకూడదు అంటూ కొందరు భావిస్తారు.

అలాంటి వారి జాబితాకు చెందిన వ్యక్తి సయ్యద్‌ దావూద్‌ గోర్ట్‌.ఈయన ఒక హోం గార్డు.

ఈయన గురించి అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో చాలా ప్రత్యేకంగా కనిపించే సయ్యద్‌ దావూద్‌ రాత్రి సమయంలో టీ కూడా అమ్ముతాడు.

ఇతడు పేద రోగులకు ఆహారం అందిస్తూ తనవంతు సాయం చేస్తూ ఉంటాడు.

సయ్యద్‌ దావూద్‌ నాంపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోం గార్డ్‌గా పని చేస్తూ ఉంటాడు.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతి సారి కూడా తప్పకుండా సయ్యద్‌ను అక్కడ డ్యూటీకి వేస్తారు.అసెంబ్లీ నుండి ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చినా కూడా వెంటనే సయ్యద్‌ మైక్‌లో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన కారు డ్రైవర్‌ను మరియు సంబంధిత అధికారులను అర్ట్‌ చేస్తాడు.

అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కారు నెంబర్‌ను గుర్తు పెట్టుకోవడం సయ్యద్‌ దావూద్‌ కు అలవాటు.గత అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కారు నెంబర్‌ మరియు డ్రైవర్‌ పేరు కూడా గుర్తుంచుకునేవాడు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.కొత్త ఎమ్మెల్యేల కార్ల నెంబర్‌లు రెండు మూడు రోజుల్లోనే గుర్తు పెట్టుకుంటానని, పాత ఎమ్మెల్యేల కారు నెంబర్‌లు మాత్రం తనకు ఇప్పటికి గుర్తే ఉన్నాయని చెబుతున్నాడు.అసెంబ్లీ జరుగుతున్నన్ని రోజులు తనకు చాలా బాగా అనిపిస్తుందని, ఎప్పుడెప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయాని ఎదురు చూస్తూ ఉంటానంటూ చెప్పుకొచ్చాడు.నేను అసెంబ్లీలో అందరికి పరిచయం అవ్వడం నా అదృష్టం అంటాడు.

సాయంత్రం 5 గంటలకు హోం గార్డ్‌ డ్యూటీ పూర్తి అవుతుంది.గంటలోనే మరో డ్యూటీలో ఎక్కేస్తాడు.

సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు నక్లెస్‌ రోడ్డులో టీ అమ్ముకుంటాడు.టీ అమ్మగా వచ్చిన ప్రతి పైనాను కూడా సేవ కోసం ఉపయోగిస్తాడు.

నీలోఫర్‌ తో పాటు ఇంకా పలు హాస్పిటల్స్‌లో రోగుల అటెండెంట్స్‌కు బోజనం కోసం సయ్యద్‌ ఖర్చు చేస్తూ ఉంటాడు.తనకు వచ్చే అతి కొద్ది జీతంను కుటుంబంకు వినియోగించుకుని, మిగిలిన మొత్తంను సేవకు ఉపయోగించడం అంటే మామూలు విషయం కాదు.అందుకే సయ్యద్‌ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుని, ఆయన నుండి స్ఫూర్తి పొందాలి.సయ్యద్‌ ను మరెంతో మంది స్ఫూర్తిగా తీసుకునేందుకు ఈ విషయాన్ని దయచేసి షేర్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube