సుమంత్‌ను ఏఎన్నార్ దత్తత ఎందుకు తీసుకున్నారో తెలుసా?

అక్కినేని వారసుడిగా సుమంత్ వెండితెరకు పరిచయమై మంచి పేరును సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసినదే.సుమంత్ నటించిన కొన్ని సినిమాలలో నైనా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.

 Reason Behind Anr Adopted Sumanth, Tollywood, Sumanth, Akkineni Nageswara Rao,-TeluguStop.com

అయితే రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సుమంత్ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ “కథానాయకుడు” సినిమాలో ఏఎన్నార్ పాత్రలో నటించి మరొకసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

హీరో సుమంత్ గురించి ఇది మాత్రమే అందరికీ తెలిసి ఉంటుంది.

కానీ సుమంత్ ని ఏఎన్నార్ దత్తత తీసుకున్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు.అసలు నాగేశ్వరరావు గారు సుమంత్ ను దత్తత తీసుకోవడానికి గల కారణాలను స్వయంగా నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

సంవత్సరానికి ఆరు,ఏడు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నాగేశ్వరరావుగారికి తన పిల్లలతో గడపలేక పోతున్నాననే వెలితి ఉండేదట.

అందాలరాముడు షూటింగ్ సమయంలో ఏఎన్నార్ గారికి హార్ట్ ఎటాక్ రావడంతో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

అదే సమయంలో సుమంత్ జన్మించడంతో తాత వద్దే ఆడుకోవడం, ఎక్కువ సమయం నాగేశ్వర రావు గారి దగ్గర గడపడంతో సుమంత్ పై ఎంతో ప్రేమను పెంచుకున్నారు.ఎలాగో తండ్రిగా తన పిల్లల ప్రేమానురాగాలకు నోచుకోలేని నాగేశ్వరరావు తన మనవడిని దత్తత తీసుకోవాలని భావించాడు.

దీంతో ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న సుమంత్ తల్లిదండ్రులకు తెలియజేశారు.

సుమంత్ ను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వెంటనే నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ సాంప్రదాయ ప్రకారం సుమంత్ ను దత్తత తీసుకున్నారు.

అప్పటినుంచి సుమంత్ తన తాత దగ్గరే పెరిగాడు.నాగేశ్వరరావు షూటింగ్ కి వెళ్లే సమయంలో తన వెంట సుమంత్ ను తీసుకు వెళ్ళేవాడు.

అంతేకాకుండా చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తన తాతగారు ఏ విధంగా నటించేవారో అదేవిధంగా సుమంత్ ఇమిటేట్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరిచేవాడు.ఈ విధంగా సుమంత్ నునాగేశ్వరరావు దత్తత తీసుకొని తన దగ్గరే పెరిగాడని ఏఎన్నార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube