విష్ణు హరి అని ఎందుకు పిలుస్తారు.. విష్ణు గురువారం పూజించడానికి గల కారణం ఏమిటి?

You Know Why Lord Vishnu Is Called Hari Why He Is Worshiped On Thursday, Lord Vishnu, Thursday, Pooja, Called Hari

పురాణాల ప్రకారం వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.ఆదివారం సూర్యభగవానుడిని పూజిస్తే సోమవారం ఆ పరమేశ్వరుడికి పూజలు చేస్తారు.

 You Know Why Lord Vishnu Is Called Hari Why He Is Worshiped On Thursday, Lord Vi-TeluguStop.com

మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం వినాయకుడికి ఈ విధంగా వారంలో ప్రతి రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అయితే గురువారం శిరిడి సాయి బాబాకు అదేవిధంగా విష్ణుమూర్తిని పూజిస్తారు.

గురువారం విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. విష్ణుమూర్తిని హరి శ్రీహరి అని కూడా పిలుస్తారు.

ఈ విధంగా విష్ణుమూర్తిని హరి అని పిలవడానికి గల కారణం ఏమిటి? విష్ణుమూర్తిని గురువారం ఎందుకు పూజిస్తారు? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

‘హరి హరతి పాపని’ అంటే ‘హరి’ అంటే మన జీవితంలో ఏర్పడే సమస్యలన్నింటిని తొలగించే వాడు అని అర్థం.హరి అంటే భుజించే వాడు అని అర్థం.

అందుకోసమే విష్ణుమూర్తిని హృదయపూర్వకంగా, భక్తిభావంతో పూజించడం వల్ల భక్తుల జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సమస్యలన్నింటినీ తొలగిస్తాడు.అందుకే ఆయనను హరి, శ్రీహరి అని పిలుస్తారు.

అదేవిధంగా విష్ణుమూర్తిని గురువారం పెద్ద ఎత్తున పూజిస్తారు.

పురాణాల ప్రకారం పక్షులలో అతి పెద్ద పక్షి గరుడ పక్షి అని చెబుతారు.

గరుడ పక్షి విష్ణు కోసం ఎంతో కఠినమైన తపస్సు చేసింది.గరుడ పక్షి తన కఠినమైన తపస్సుతో విష్ణు భగవానుడిని మెప్పించడం వల్ల విష్ణుమూర్తి తనకు వాహనంగా గరుడ పక్షిని నియమించుకున్నాడు.

గురు అంటే బరువైనది అని అర్థం.గరుడ అంటే కఠినమైన విజయాన్ని సాధించిందని అర్థం.

ఈ కారణం చేతనే గురువారం ఆ విష్ణుమూర్తిని పెద్ద ఎత్తున పూజిస్తారు.అదేవిధంగా కొంతమంది పండితులు కూడా గురు బృహస్పతి విష్ణు రూపం అని నమ్ముతారు కాబట్టి గురువారం విష్ణుమూర్తికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

అదేవిధంగా ఎక్కువగా విష్ణుభగవానుడు క్షీర సాగరం పై నాగ శేషు పై పడుకొని ఉన్న ఫోటోను ఎక్కువగా చూసే ఉంటారు.క్షీరసాగరం అంటే ఆనందం, శేషనాగు దుఃఖాన్ని చూపిస్తుంది.

విష్ణు భగవానుడు ఈ ఫోటో ఆనందంలోనూ, దుఃఖంలోనూ ఎప్పుడు ఒకే విధంగా జీవించాలని తెలియజేస్తుంది.

Video : You Know Why Lord Vishnu Is Called Hari Why He Is Worshiped On Thursday, Lord Vishnu, Thursday, Pooja, Called Hari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube