వామ్మో.. 24 నిముషాల్లో ఇత‌ను ఎన్ని బ‌ర్గ‌ర్లు తిన్నాడో తెలిస్తే

You Know How Many Burgers He Ate In 24 Minutes

ఈ ప్రపంచంలో ఎన్నో ర‌కాల వింత‌లు జ‌రుగుతూనే ఉంటాయి.ఇందులో ఛాలెంజింగ్‌కు సంబంధించిన‌వి కూడా ఉంటాయండోయ్‌.

 You Know How Many Burgers He Ate In 24 Minutes-TeluguStop.com

కొంద‌రు ఇలాంటి ఛాలెంజ్ ల‌ను ఛేదించి త‌మ ట్యాలెంట్ ఏంటో నిరూపించుకుంటారు.అందుకే వారిని అంద‌రూ అభిమానిస్తారు.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.అయితే ఇది ఏదో బ‌ల ప‌రీక్ష‌కు సంబంధించింది కాదండోయ్ తిండికి సంబంధించింది.

 You Know How Many Burgers He Ate In 24 Minutes-వామ్మో.. 24 నిముషాల్లో ఇత‌ను ఎన్ని బ‌ర్గ‌ర్లు తిన్నాడో తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా అంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన బ‌ర్గ‌ర్ తిండికి సంబంధించింది కావ‌డం విశేషం.

బ‌ర్గ‌ర్ లు అంటే మ‌న దేశంలో చాలా మందికి తెలియ‌దు గానీ ఇత‌ర దేశాల్లో అదీ కూడా ఇంగ్లాండ్ లాంటి దేశంలో చాలా ఫేమ‌స్‌.

నిజానికి ఇంగ్లండ్ దేశానికి చెందిన వారు బ‌ర్గ‌ర్ ల‌ను తినేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు.కానీ బ‌ర్గ‌ర్ తినాలంటే చాలానే స‌మ‌యం ప‌డుతుంది.

ఈజీగా ఒక బ‌ర్గ‌ర్ తినేందుకు క‌నీసం ప‌ది నుంచి ప‌దిహేను నిముషాలు ప‌డుతుంది.అయితే ఓ వ్య‌క్తి మాత్రం త‌న‌కు అంత టైమ్ అక్క‌ర్లేదంటూ కేవ‌లం  24నిముషాల్లోనే 6 బర్గర్లు లాగించేశాడు.

ఏంటి నిజ‌మా అని షాక్ అవ్వ‌కండి మీరు విన్న‌ది నిజ‌మే.

అదే అత‌ని ట్యాలెంట్ మ‌రి. కైలీ గిబ్సన్ అనే వ్య‌క్తి ప్రొఫెషనల్‌ ఈటర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఎప్ప‌టి నుంచో ఇలాంటి ఈటింగ్ ఛాలెంజింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఇక ఇప్పుడు మాత్రం బ‌ర్గ‌ర్ ల మీద ప‌డ్డాడు మ‌నోడు.త‌న‌లా ఎవ‌రూ బ‌ర్గ‌ర్ ల‌ను తిన‌లేర‌ని నిరూపించేందుకు కేవ‌లం 24 నిముషాల్లోనే 6 బ‌ర్గ‌ర్ లు తినేసి త‌న ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడు.

ఇదంతా విన‌డానికి ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నా కూడా ఈ వైర‌ల్ వీడియోను చూస్తే మీకే అర్థం అవుతుంది.అయితే అత‌న్ని చూసిన వారంతా కూడా ఇత‌ను మామూలు ఈట‌ర్ కాదంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

#Burgers #Burgers #Kili Gabsan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube