ఎకో ఫ్రెండ్లీ హౌస్ గురించి మీరు విన్నారా..? అసలు దీనికి మూల కారణం ఎవరంటే..?

సైన్స్, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని కాలంలో మన పూర్వికులు వారు నివసించే ఇళ్లను మట్టితో కట్టుకునేవారు.మట్టితో కట్టిన ఆ ఇళ్లలోనే వారు జీవించారు.

 You Heard About The Eco Friendly House Telca House, Latest News, Viral Latest,-TeluguStop.com

కానీ కాలానుసారంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందడంతో ఇప్పుడు రకరకాల మోడల్స్ తో ఎవరికి నచ్చినట్టు వారు ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నారు.కానీ ప్రపంచంలోనే సంపన్న దేశంగా పేరుగాంచిన ఒక దేశం మాత్రం టెక్నాలజీని అనుసరించకుండా మట్టితో ఇళ్లను కడుతోంది.

మరి ఆ  దేశం ఏంటి.ఎందుకు మట్టితో ఇళ్లను నిర్మిస్తుంది అనే వివరాలు చూద్దామా.

సంపన్న దేశాలలో ఒకటి అయిన ఇటలీలోని రావెన్న ప్రాంతంలో ఒక కుండ ఆకారంలో ఉండేలాగా ఇళ్లను కడుతున్నారు ఈ ఇళ్ల నిర్మాణానికి బంకమట్టిని ఉపయోగిస్తున్నారు.అచ్చం ఈ ఊళ్లను చూస్తే అప్పట్లో మన పూర్వికుల నివసించిన ఇళ్లమాదిరిగానే కనిపిస్తాయి.

Telugu Eco Friendly, Latest, Telca-Latest News - Telugu

అలాగే ఈ బంక మట్టితో చేసిన కుండ ఆకారంలో ఉండే ఇళ్లను టెల్కా హౌసులు అని అంటారట.అలాగే ఈ ఇళ్లకు ఉన్న ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే 3D ప్రింటింగ్‌ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లోనే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చట.645 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఈ గుండ్రని ఇళ్ల లోపల ఒక బెడ్‌ రూమ్, బాత్‌ రూమ్, అలాగే ఒక లివింగ్‌ రూములతో పాటు సకల సౌకర్యాలతో కూడిన అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి.కాగా ఈ ఇళ్లు నిర్మించాలనే ఆలోచనను చేసింది మరెవరో కాదు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ అయిన మారియో కుసినెల్లా.

ఇళ్లు లేనివారు ఇలా అతి తక్కువ సమయంలో ఇలాంటి ఇళ్లను కట్టుకోవచ్చు.

Telugu Eco Friendly, Latest, Telca-Latest News - Telugu

రాబోయో రోజుల్లో ఇంకాస్త తక్కువ సమయంలోనే కట్టేస్తానంటున్నాడు మారియో.అలాగే ఈ డోమ్‌ హౌస్‌ల నిర్మాణాల  వెనుక మరొక గొప్ప ఆలోచన కూడా ఉందండోయ్.అది ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణరహిత ఇళ్ళు ఇవే.అంటే వీటిని ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అని కూడా అనవచ్చు.ఈ ఇళ్ల నిర్మాణం వలన పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు.

ఒకవేళ ప్రకృతి విపత్తుల వలన ఇవి కూలిపోతే 3D ప్రింటింగ్‌ తో తిరిగి నిర్మించుకోనే సదుపాయం ఉందని మారియో చెబుతున్నాడు.కాగా జీరో కార్భన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడడం విశేషం అనే చెప్పాలి.

అలాగే ఈ ప్రాజెక్ట్ క్లైమాట్‌ ఛేంజ్‌ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడడం గమనార్హం.ఈ ఇళ్ళు కూడా కుండ ఆకారంలో చూడడానికి భలే ముద్దుగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube