ఆ జిమ్‌లోకి వెళ్లాలంటే ఈ వింత రూల్ పాటించాల్సిందే..|

నిజానికి మ‌న ద‌గ్గ‌ర కొన్న ర‌కాల కండీష‌న్లు ఉండ‌వు కానీ చాలా వ‌ర‌కు ఇత‌ర ప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్లు, గానీ లేదా జిమ్‌ల‌లో వింత వింత రూల్స్ ఉంటాయి.దీంతో అవ్వి చాలా ఫేమ‌స్ అవుతుంటాయి.

 You Have To Follow This Strange Rule To Go To The Gym-TeluguStop.com

యాజ‌మాన్యాలు ఏ ఉద్ధేశ్యంతో అలాంటి రూల్స్ పెట్టినా కూడా చివ‌ర‌కు అది ఆ సంస్థ‌ను మాత్రం విప‌రీతంగా ఫేమ‌స్ చేస్తుంద‌నే చెప్పాలేమో.ఇక ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది మాత్రం చండీఘర్ లేక్ క్లబ్ మెంబర్స్ పేరుతో ఉండే జిమ్‌.

ఈ జిమ్ ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టి త‌మ‌లోని స‌భ్యులంద‌రికీ నోటీస్ ఇష్యూ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అయితే ఇక్క‌డే ఓ ట్విస్టు ఉంది.అదేంటంటే అందులో ఉండే రూల్స్ అంత‌ క్రేజీగా ఉండటంతో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి.ఇందుకు స‌బంధించిన రూల్స్ ఇప్పుడు కాస్తా సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతున్నాయి.

 You Have To Follow This Strange Rule To Go To The Gym-ఆ జిమ్‌లోకి వెళ్లాలంటే ఈ వింత రూల్ పాటించాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవేంటంటే ఈ జిమ్ కు వచ్చే స‌భ్యులు క‌చ్చితంగా వారి అండర్‌వేర్ మీద స్టాంప్ ఉండాలని చెబుతున్నారు.

ఇంకో రూల్ ఏంటంటే స‌భ్యులు అంద‌రూ కూడా ముందుగానే త‌మ స్మెల్ టెస్ట్ చేయించుకోవాలని అత్యంత‌ దారుణమైన కండీష‌న్ పెట్టారు జిమ్ ఓన‌ర్లు.

దీంతో దీన్ని కాస్తా ఓ జర్నలిస్టు వెంట‌నేన సోష‌ల్ మీడియాలో వేదిక‌గా త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దీన్ని చూసిన నెటిజ‌న్లు విప‌రీతంగా కామెంట్లు పెడుతున్నారు.

అస‌లు ఏంటీ రూల్స్ అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.ఇలాంటివి పెడితే ఎవ‌రైనా వ‌స్తారా అంటూ అడుగుతున్నారు.

మొత్తానికి ఇలాంటి రూల్స్ అనేవి భ‌లే విచిత్రంగా ఉంటాయి క‌దూ.కానీ ఇవి మ‌న దేశంలో అయితే అస్స‌లు న‌డ‌వ‌వ‌నే చెప్పాలి.

బ‌య‌టి దేశాల్లో అయితే మాత్రం ప‌నిచేస్తాయి కావ‌చ్చు.చూడాలి మ‌రి వీరి ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో.

#Strange Rule

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు