చీటికిమాటికి మూత్రం వస్తోందా? అయితే ఇవిగో చిట్కాలు  

You Have To Pee Repeatedly ? Try These Remedies-

మూత్రం ఒంట్లోంచి ఎందుకు బయటకివస్తుందో మనకి తెలుసు. ఒంట్లో ఉన్న మలినాల్ని ఇది బయటకి తీస్తుంది. కాబట్టి మనుషలు మూత్ర విసర్జన చేయాలి..

చీటికిమాటికి మూత్రం వస్తోందా? అయితే ఇవిగో చిట్కాలు-

అందుకే బ్లాడర్ నిండగానే మనం ఆపుకోలేని విధంగా మన బ్లాడర్ నిర్మాణం జరిగింది. మూత్రాన్ని ఆపుకోవడం మంచిది కాదు, బ్లాడర్ ఫుల్ అయినప్పుడు విసర్జించాలి. కాని అదేపనిగా మూత్రం వస్తే ఎలా? రోజుకి 5-8 సార్లు అయితే ఓకే కాని, అంతకుమించి మూత్రం వస్తోందంటే అది ఆరోగ్యకరమైన స్థితి కాదు. ట్రాక్ట్ ఇంఫెక్షన్స్, ఓవర్ యాక్టీవ్ బ్లాడర్, షుగర్ వ్యాధిలాంటి సమస్యలు ఉండొచ్చు.

మరి అతిమూత్రం సమస్య నుంచి బయటపడి, నలుగురిలో ఇబ్బందిపడకూడదు అంటే ఏం చేయాలివ?* పాలకూర గొప్ప న్యూట్రిషన్ వాల్యూ కలిగిన ఆహారం. దీన్ని ఉడకబెట్టి తింటే ఇది బ్లాడర్ కి ఎంతో మేలు చేస్తుంది. మాటిమాటికి మూత్రం రాకుండా యూరీన్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

ఓ లిమిట్ గా, రెగ్యులర్ గా తీసుకోండి, మీ సమస్యతో మీరే సొంతంగా పోరాడవచ్చు.* టున్నుల కొద్ది యాంటిఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది దానిమ్మ. దానిమ్మ ఇత్తులు మాత్రమే కాదు, దాని చర్మం కూడా లాభదాయకమే.

దానిమ్మ చర్మాన్ని ఓ పేస్టులా తయారుచేసి, నీటిలో వేసి సేవిస్తూ ఉండండి. కొన్ని రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయి* ఉలువలు తెలుసుగా? ఉలువల చారు ఇష్టంగా తింటాం కదా. వీటని బెల్లంతో కలిపి తింటే నిజంగానే అతిమూత్రం సమస్య తగ్గుతుంది.

* గుమ్మడికాయ ఇత్తులని ఎప్పడైనా గమనించారా? ఇందులో ఫ్యాటి ఆసిడ్స్ బాగా ఉంటాయి. ఇవి మీ బ్లాడర్ కి అవసరమైన ఫుడ్ ఐటమ్స్‌. ఇది బ్లాడర్ పనితనాన్ని బ్యాలెన్స్ చేసి అతిమూత్రాన్ని ఆపుతుంది.

* మెంతి గింజలు, అల్లంని బాగా దంచి, పౌడర్ లాగా చేసుకోండి. ఈ మిశ్రమంని అలాగే తీసుకోవడం చాలా కష్టం అందుకే కొంచెం తేనే కలుపుకోని రెగ్యులర్ గా తీసుకోండి. ఊహించని మార్పు కనబడుతుంది.

* ఇంకా చెప్పాలంటే బెకింగ్ సోడాని నీళ్ళలో కలుపుకోని తాగడం, గోరువెచ్చని నీటిలో వైట్ వెనిగర్ కలుపుకోని తాగడం కూడా ఈ సమస్యపై పనిచేస్తాయి.