ఎఫ్‌ 2 కలెక్షన్స్‌... ఇండస్ట్రీలో ఏ ఒక్కరు ఇంత వస్తాయని ఊహించి ఉండరు, చరణ్‌ ముంచితే, వరుణ్‌ తేల్చాడు

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్‌ 2’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.సినిమాలో పెద్దగా కథ లేదు, స్టార్‌ కాస్టింగ్‌ లేదు, వామ్మో అన్నట్లుగా ట్విస్ట్‌లు లేవు, టర్నింగ్స్‌ లేవు.

 You Did Not Believe About F2 Movie Collections-TeluguStop.com

ఏం లేకున్నా కూడా అద్బుతమైన వసూళ్లు కేవలం ఎంటర్‌ టైన్‌మెంట్‌తోనే సాధ్యం అవుతున్నాయి.కేవలం కామెడీకి మాత్రమే సినిమా వంద కోట్లను వసూళ్లు చేసింది.ఈ చిత్రం దాదాపుగా 125 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.ఎఫ్‌2 చిత్రం బడ్జెట్‌ 25 కోట్లు.

ఎఫ్‌ 2 విడుదల సమయంలో ఎవ్వరు కూడా ఈ చిత్రం 30 కోట్లకు మించి వసూళ్లు నమోదు అవుతాయని ఊహించలేదు.25 కోట్ల చిత్రం 30 కోట్లను వసూళ్లు చేస్తే పెద్ద సంచలనమే అని చెప్పుకోవాలి.ఎందుకంటే చిన్న హీరోల సినిమాలు 5 కోట్ల రూపాయల లాభాలను దక్కించుకోవడం అంటే చాలా పెద్ద విషయం.ఇప్పుడు ఆ సంచలనం ఎఫ్‌ 2 విషయంలో నమోదు అయ్యింది.

ఎఫ్‌ 2 చిత్రం దాదాపుగా 75 కోట్ల షేర్‌ను దక్కించుకుంది.అంటే 50 కోట్ల లాభాలు.

కేవలం కలెక్షన్స్‌తో 50 కోట్ల లాభాలు అయితే, డిజిటల్‌ రైట్స్‌, ఆన్‌లైన్‌ రైట్స్‌ ఇంకా ఇతర రైట్స్‌తో మరో 25 కోట్ల వరకు వస్తాయి.

మొత్తంగా దిల్‌రాజుకు ఈ చిత్రం 75 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది.ఒక వైపు ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని కొనుగోలు చేసినందుకు దిల్‌రాజుకు నెత్తిన గుడ్డ పడింది.15 కోట్లతో కొనుగోలు చేస్తే కనీసం 5 కోట్లు కూడా రాలేదట.దాంతో దిల్‌రాజు ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయాడు.మరో వైపు ఎఫ్ 2 వల్ల దిల్ రాజు ఏకంగా 75 కోట్లను దక్కించుకున్నాడు.మొత్తానికి అన్న నష్టాలను మిగిల్చితే తమ్ముడు వరుణ్ లాభాలు తెచ్చి పెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube