ఇలాంటి ఘనత సాధించడానికి మీరే అర్హులు జక్కన్న.. తారక్ ట్వీట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు.

 You Deserve To Achieve Such A Feat, Jakkanna Tarak S Tweet Is Viral ,jakkanna ,-TeluguStop.com

ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే.

ఈ సినిమా కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా చూసిన హాలీవుడ్ ప్రేక్షకులు, దర్శకులు పెద్ద ఎత్తున జక్కన్న పై ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే ఈ సినిమాని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఓ థియేటర్లో ప్రత్యేకమైన షో వేశారు.ఇక ఈ షో చూడటానికి రాజమౌళి కూడా హాజరయ్యారు.ఇక ఈ షో ఎంతో విజయవంతం కావడంతో ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.ఇక రాజమౌళి చేసిన ఈ ట్వీట్ కి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.

ఇలాంటి ఘనత సాధించడానికి మీరే అర్హులు జక్కన్న అంటూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ విషయంపై రామ్ చరణ్ ఇదివరకే స్పందిస్తూ ట్వీట్ చేయగా తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటినీ పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి ప్లాన్ చేశారు.అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో బిజీగా ఉండగా ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు.

కొరటాల శివ దర్శకత్వంలో ఈయన తన తదుపరి సినిమాని ప్రకటించినప్పటికీ ఇంకా ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube