ఈ బామ్మ చేస్తున్న ప‌ని చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు..

చిన్న పిల్ల‌లు, ముస‌లివాళ్లు చేసే ప‌నులు ఎవ‌రికైనా న‌వ్వు తెప్పిస్తుంటాయి.ఈ ఇద్ద‌రిది అమాయ‌క‌త్వ‌మ‌నే చెప్పాలి.

 You Cant Help But Laugh When You See What This Grandmother Is Doing-TeluguStop.com

ఇప్పుడున్న బామ్మ, తాతయ్యలకు కొత్త‌గా వ‌స్తున్న టెక్నాల‌జీ గురించి తెలియ‌ద‌నే చెప్పాలి.దీంతో వారు అస‌లు అదేంటో తెలియ‌క నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

ఇంకొన్ని సార్లు ఈ కొత్త త‌ర‌హా టెక్నాలజీ వస్తువలతో వారు ప్ర‌వ‌ర్తించే తీరు నవ్వులు తెప్పిస్తుంద‌నే చెప్పాలి.ఇక ఇలాంటి ఫ‌న్నీ మూమెంట్స్ కు సంబంధించిన వీడియోల‌కు సోషల్ మీడియా బాగానే ఆద‌ర‌ణ ఇస్తూ ఉంటుంది.

 You Cant Help But Laugh When You See What This Grandmother Is Doing-ఈ బామ్మ చేస్తున్న ప‌ని చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఓ బామ్మ ఇలాగే ఓ టెక్నాల‌జీ వ‌స్తువుతో చేసిన ప‌ని చూస్తే న‌వ్వు రాక మాన‌దేమో.ఈ వీడియోలో ఆ బామ్మ అలెక్సాతో చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.

ఆమె ఇంట్లో అలెక్సాలో సాంగ్స్ ప్లే అవుతుండ‌గా అక్క‌డే సేద‌దీరుతున్న బామ్మా దాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.ఇక వ‌స్తూనే త‌న‌కు గణపతి భజన పాట‌లు పాడాల‌ని కోరింది.

ఇత‌ర సినిమాల‌కు సంబంధించిన పాట‌లు త‌న‌కు వ‌ద్ద‌ని, కేవలం దేవుడి పాటలే రావాలని చెప్తోంది.ఇక ఇదంతా కూడా అక్క‌డు ఉండే కొంద‌రు రికార్డు చేయ‌గా దాన్ని నేహ శర్మ తన ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.

ఇంకేముంది ఇలాంటి ఫ‌న్నీ వీడియోను చూస్తే నెటిజ‌న్లు ఊరుకుంటారా ఈజీగానే దాన్ని వైర‌ల్ చేసేశారు.బామ్మ‌కు ఇప్ప‌టి టెక్నాల‌జీ గురించి తెలియ‌దేమో అని కొంద‌రు కామెంట్లు పెడుతుంటే ఇంకొంద‌రేమో అయ్యో ఆ బామ్మ‌కు అస‌లు విష‌యం చెప్పండి అంటూ కోరుతున్నారు.

ఇలా ఈ వీడియోమీద చాలా ర‌కాల ఫ‌న్నీ కామెంట్లు వ‌స్తున్నాయి.పోస్టు చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఈ వీడియోకు దాదాపుగా 72వేల‌కు పైగా లైక్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే ఈ వీడియోకు ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా చూసేయండి.

#Grandmother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు