ఫిట్ నెస్ కోసం ఈ పిల్లి జిమ్‌లో ఏం చేస్తుందో చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.

You Can Not Help But Laugh At What This Cat Does In The Gym For Fitness

సోషల్ మీడియా అదో వింత ప్రపంచం.ప్రస్తుతం ఎవరు తిన్నా తినకపోయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

 You Can Not Help But Laugh At What This Cat Does In The Gym For Fitness-TeluguStop.com

తాము ఏం చేస్తున్నామనేది తప్పకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇలా కొంత మంది తాము మాత్రమే కాకుండా తమ పెంపుడు జంతువులు కూడా ఏం చేస్తున్నాయనేది వీడియోల రూపంలో తెలియజేస్తూ వస్తున్నారు.

ఇలా కొంత మంది షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.ఎంతో మంది నెటిజన్ల అభిమానాన్ని చూరగొంటున్నాయి.

 You Can Not Help But Laugh At What This Cat Does In The Gym For Fitness-ఫిట్ నెస్ కోసం ఈ పిల్లి జిమ్‌లో ఏం చేస్తుందో చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాగే ఓ వ్యక్తి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ పిల్లి జిమ్ చేస్తూ ఉంటుంది.

బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ఎక్కువ మంది జిమ్ లో వర్కవుట్లు చేస్తుంటారు.ఇది ఓ విధానం.కొంత మంది ఫిట్ నెస్ కోసమని తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తే, కొంత మంది ఇలా జిమ్ లో కష్టపడతారు.ఓ పిల్లి కూడా జిమ్ లో వర్కవుట్లు చేయాలని నిర్ణియించుకున్నట్లుంది.

అనుకున్నదే తడవుగా జిమ్ కు వెళ్లి వివిధ రకాల వర్కవుట్లను చేసేసింది.పిల్లి వర్కవుట్లు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనికి ఆ యూజర్ క్యాట్ డూయింగ్ కిట్ అప్స్ అని కామెంట్ జత చేశాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఒక యూజర్ పిల్లిని బాడీ బిల్డింగ్ పోటీలకు పంపాలని అంటుండగా.కొంత మంది పుష్ అప్ లతో తగ్గేదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇలా జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న పిల్లిని మీరూ చూసేయండి.ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

#Fitness

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube