పర్యాటకులను ఆకర్షించడానికి ఒక్కరోజు పెళ్లి.... వింతగా ఉంది కదా!

షరతులతో కూడిన పెళ్లి గురించి ఎప్పుడైనా విన్నారా.అదేదో తెలుగు సినిమా లో ఒక ఏడాది అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి గుర్తు ఉండే ఉంటుంది.

 You Can Marry A Local For A Day In Amsterdam-TeluguStop.com

అయితే నెదర్లాండ్స్ లో మాత్రం ఒక్క రోజు కోసం పెళ్లి చేసుకోవచ్చు.కానీ ఇక్కడే ఒక్క మెలిక ఉంది.

అదేంటంటే పెళ్లి అయిన తరువాత ఆమె తో కలిసి నగరం మొత్తం చుట్టేయొచ్చు,ఇంకా ఇద్దరూ కలిసి ఎంచక్కా సెల్ఫీ లు తీసుకుంటూ ఎంజాయ్ కూడా చేయొచ్చు.కానీ పెళ్లి అయ్యింది కదా అని ఎడ్వాంటేజ్ తీసుకొని ముద్దు పెట్టడానికి లేదు.

ఏంటి ఇంతకీ ఇదేమి పెళ్లి అనుకుంటున్నారా.నెదర్లాండ్స్ లో ఆమ్ స్టర్ డాం లో యువతకు ఆకర్షించడానికి అక్కడి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విధంగా ఒక్క రోజు పెళ్లి అనేది మొదలు పెట్టారు.

అయితే ఈ పెళ్లి కి మీరు తయారు అవ్వాలంటే ఖచ్చితంగా వేలం పాటలో పాల్గొని ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.వేలం పాట లో ఈ ఛాన్స్ మీకు లభిస్తే ఇక మీరు చక్కగా ముస్తాబు అయి పెళ్లి చేసుకోవచ్చు.

అయితే కాస్తపాటి కౌగిలింతలు మాత్రం లభిస్తాయి తప్ప మరేమి ఉండదు.పర్యాటకులకు సాధారణ గైడ్‌ మాదిరిగా కాకుండా ఆత్మీయ స్నేహితురాలిగా మెలుగుతూ దగ్గరుండి ప్రాంతాన్ని ఆ వధువు చూపిస్తుందన్న మాట.

పర్యాటకులను ఆకర్షించడానికి ఒ

ఇరువురి మధ్య గౌరవానికి భంగం రాకుండా ఈ పెళ్లి సహాయపడుతుంది అని ఈ విధంగా పెళ్లి తతంగం పెట్టి యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.పర్యాటకులకు, ఆ ప్రాంతవాసులకు మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకూ ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతోందట.దీని ద్వారా వచ్చే ఆదాయం లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విని యోగిస్తున్నారు.2015 నుంచి ఈ వివాహాలను ‘వెడ్‌ అండ్‌ వాక్‌’పేరుతో నిర్వహిస్తున్నారు జోనా రెన్స్‌.ఆమ్‌స్టర్‌డాంలోని స్థానిక మార్కెటింగ్‌ సంస్థలు, వ్యాపారులు ‘అన్‌టూరిస్ట్‌ గైడ్‌ టు ఆమ్‌ స్టర్‌డాం’పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.ఇక ఏముంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు అందరూ కూడా ఈ వేలం పాట లో పాల్గొనొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube