ఆధార్ న్యూ వెబ్‌సైట్‌లో ఈ అద్భుతమైన సేవలు పొందొచ్చు..!

You Can Get These Amazing Services On Aadhaar New Website

ప్రతి ఒక్క భారతీయుడి జీవితంలో అంతర్భాగమైన ఆధార్ సేవలను ఆధార్ సంస్థ యూఐడీఏఐ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది.ఇటీవలే https://myaadhaar.uidai.gov.in/ బీటా పోర్టల్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

 You Can Get These Amazing Services On Aadhaar New Website-TeluguStop.com

ఈ పోర్టల్ వేదికగా అన్ని రకాల సేవలను యాక్సెస్ చేయవచ్చు.ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావడమే! ఇందులో ఉన్న కొన్ని సేవలను ఉచితంగా పొందొచ్చు.

కొన్ని సేవలకు ఆన్‌లైన్‌లోనే కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.ఈ పోర్టల్‌లో అత్యంత ఉపయోగకరమైన సేవలు ఏవో ఇప్పుడు చూద్దాం.

 You Can Get These Amazing Services On Aadhaar New Website-ఆధార్ న్యూ వెబ్‌సైట్‌లో ఈ అద్భుతమైన సేవలు పొందొచ్చు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1.డౌన్‌లోడ్ ఆధార్:

మైఆధార్ పోర్టల్‌లోకి వెళ్లి Download Aadhaarపై క్లిక్ చేయాలి.తరువాత డిజిటల్ సంతకం, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉన్న ఆధార్ డిజిటల్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2.లాక్/అన్‌లాక్ ఆధార్:

మీరు తప్ప మిగతా ఎవరూ కూడా మీ ఆధార్ కార్డును వినియోగించుకూడదని భావిస్తే దాన్ని మీరు లాక్ చేసుకోవచ్చు.పోర్టల్‌లోకి ఆధార్ లాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి తర్వాత సూచనలు పాటిస్తే సరిపోతుంది.

Telugu Aadhar Card, Latest News, New Link, New Updates, New Website-Latest News - Telugu

3.లొకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్:

ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాలనుకుంటున్నారా? కానీ ఆధార్ సెంటర్ అడ్రస్ తెలియక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.మైఆధార్ పోర్టల్‌ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీకు సమీపంలో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ అడ్రస్ ను తెలుసుకోవచ్చు.

Telugu Aadhar Card, Latest News, New Link, New Updates, New Website-Latest News - Telugu

4.ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు

పాకెట్ సైజులో పాన్ కార్డు రూపంలో అరచేతిలో పట్టేంత చిన్నగా ఉండే ఆధార్ కార్డు కావాలనుకుంటున్నారా? దీనికోసం మీరు ఆధార్ పీవీసీ కార్డ్ డౌన్‌లోడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.తర్వాత మీరు ఆర్డర్ చేసిన ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ ను మైఆధార్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ ఆధార్ పీవీసీ కార్డు ఆర్డర్ స్టేటస్ పై క్లిక్ చేసి మీ సమాచారం పొందుపరిచి తెలుసుకోవచ్చు.

#Website #Aadhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube