కుక్కతో ఫొటోదిగి ప్రొఫైల్‌లో పెట్టుకుంటే గర్ల్స్‌ను ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చట.. తెలుసా?

మనలో అనేకమంది కుర్రాళ్ళు తమకు ఇష్టమైన అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక నానాయాతన పడుతూ వుంటారు.నేటి యువత సరైన కంపేనియన్‌షిప్ కోసం డేటింగ్ యాప్స్‌ను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆశ్రయిస్తారనే విషయం తెలిసిందే.

 You Can Easily Impress Girls If You Take A Photo With A Dog And Put It In Your-TeluguStop.com

కానీ ఈ ప్లాట్‌ఫామ్స్‌లో సరైన పార్ట్‌నర్‌ను పొందడం పురుషులకు అనుకున్నంత ఈజీ కాదు.ఇక్కడ ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి.

అయితే ఇవే సమస్యలపై పరిశోధించిన స్పెయిన్‌లోని జేన్ యూనివర్సిటీ దాదాపు 300 మంది ఫిమేల్ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి డేటా సేకరించింది.

దీని ప్రకారం ఓ ఆసక్తికరమైన విషయం బయల్పడింది.

పెంపుడు జంతువులు లేనివారి కంటే చిన్న కుక్కలను కలిగిఉన్న పురుషులతో మహిళలు ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటారని తేలింది.ఆన్‌లైన్ డేటింగ్ ప్రొఫైల్స్‌లో పెట్ డాగ్స్ ఫొటోలు కలిగిన పురుషులు మరింత సన్నిహితంగా, ఆకర్షణీయంగా భావించబడతారని ఈ అధ్యయనంలో తేలడం గమనార్హం.

ఇందులో భాగంగానే పరిశోధకులు కాలేజీ అమ్మాయిలకు ఒంటరిగా లేదా కుక్కతో నడుస్తున్న స్త్రీ పురుషుల చిత్రాలను చూపించారు.ఇలా లెక్కలేనన్ని ఫొటోలను చూపించిన తర్వాత చిన్న కుక్క పిల్లలతో ఉన్న పురుషులను ఫ్రెండ్లీ, అట్రాక్టివ్‌గా భావించారని నిర్ధారించారు.

Telugu Impress, Profile, Latest-Latest News - Telugu

అంటే పెట్స్ ని ప్రేమగా చూసుకునేవారు తమ పార్టనర్ ని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో చూస్తారని మహిళలు అనుకుంటున్నారట.ఈ క్రమంలోనే వారు ఎక్కువగా పెట్స్ ని పెంచే పురుషులను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేలింది.ఆసక్తికరంగా.డేటింగ్ యాప్స్ ద్వారా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు మహిళలు చూడాల్సిన కొన్ని ప్రధాన ‘రెడ్ ఫ్లాగ్స్’ గురించి ఒక ఫిమేల్ రెడిట్ యూజర్ షేర్ చేసిన కొద్ది రోజులకే ఈ పరిశోధన ఫలితం వచ్చింది.

ఆమె తన ప్రొఫైల్‌లో ‘నేను కుక్క యజమానిని.నాతో డేటింగ్ చేయబోయే వ్యక్తి కూడా ఇలాగే పెట్ డాగ్ కలిగి, ప్రేమను పంచేవాడైతే నాకు ఓకే’ అని ప్రస్తావించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube