నందమూరి తారకరత్న( Taraka Ratna ) గుండెపోటుకి గురై ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా తారకరత్న మరణ వార్త తన కుటుంబ సభ్యులను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది మరణించడంతో తన భార్య పిల్లలు తరచూ తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉన్నారు.
తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అలేఖ్య రెడ్డి ( Alekhya Reddy ) పెళ్లి కారణంగా తన కుటుంబ సభ్యులందరికీ దూరమయ్యారు.ఇలా తారకరత్నను అలేఖ్యను తన కుటుంబ సభ్యులు దూరం పెట్టడంతో ఎన్నో బాధలు అనుభవిస్తూ జీవితంలో సంతోషంగా గడుపుతున్న సమయంలోనే తారకరత్న మరణించారు.
ఇలా తారకరత్న మరణ వార్త అలేఖ్య రెడ్డిని చాలా కృంగతీస్తోంది.ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా తరచూ ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే తారకరత్నతో కలిసి ఉన్నటువంటి ఒక పాత ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి స్పందిస్తూ.
ఈ జన్మకు జీవితం ఇంతే.తారకరత్ననే తన లోకమని చెప్పుకొచ్చారు.
తారకరత్న జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేస్తానని…తన ఊపిరి ఉన్నంతవరకు తారకరత్నను ప్రేమిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇలా అలేఖ్య రెడ్డి తారకరత్న గుర్తు వచ్చిన ప్రతిసారి తనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను, తనపై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే ఈ పోస్టులు క్షణాలలో ఫైరల్ అవుతున్నాయి.తన భర్త చనిపోయి దాదాపు మూడు నెలలు అవుతున్న అలేఖ్య రెడ్డి ఇంకా తన భర్త మరణం నుంచి బయట పడలేకపోతున్నారని తెలుస్తుంది.తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి కుటుంబానికి బాలకృష్ణ ( Balakrishna ) విజయసాయిరెడ్డి( Vijay Sai Reddy ) అండగా నిలిచారు.
ఇక ఇదే విషయాన్ని అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.