కాకినాడ ఇక యోకొహామా

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ పేరు మారిపోయిందని అనుకుంటున్నారా? అదేం కాదు.దాని పేరు అలాగే ఉంటుంది.

 Yokohama City Council To Develop Kakinada-TeluguStop.com

అయితే నగరం రూపురేఖలు మారిపోతాయి.ఎలా? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విదేశాల పిచ్చి పట్టింది కదా.ప్రతి జిల్లాను, ప్రతి నగరాన్ని ఏదో ఒక విదేశంలా లేదా అక్కడి నగరాల్లా చేయాలని తపించిపోతున్నారు.ఆ తపనతోనే ఓ ఆర్థిక పమస్యలు వల్లెవేస్తూనే విదేశాలకు తిరుగుతున్నారు.‘మీరు వచ్చి మా రాష్ర్టాన్ని అభివృద్ధి చేయండి’ అని ఆహ్వానిస్తున్నాడు.బుర్రలోకి ఏ దేశం ఆలోచన వస్తే ఆ దేశంలా తయారు చేస్తానంటున్నారు.

సరే అసలు సంగతి ఏమటంటే….జపాన్లోని యోకొహామా సిటీ కౌన్సిల్‌ వారు తాము కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు.

తమ సిటీ మాదిరిగా తీర్చిదిద్దుతామంటున్నారు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దీన్ని స్మార్‌్ట సిటీ చేస్తామంటున్నారు.

ఆ సిటీ అధికారులు వచ్చి చంద్రబాబుతో మంతనాలు జరిపారు.ఇక్కడి నౌకాశ్రయంతో సహా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటున్నారు.

యొకొహామా జపాన్‌లోని రెండో అతి పెద్ద నగరం.దానిమాదిరిగా కాకినాడను చేయాలంటే ఎంత డబ్బు ఖర్చవుతుందో? బాబుగారు అంత ఖర్చు చేయగలడా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube