కొన్ని దశాబ్దాల హిందువుల కల అయోధ్యలో రాముని దేవాలయం నిర్మించాలన్న సంకల్పానికి గత ఏడాది ఉన్న అడ్డంకులు అన్ని తొలగి నా సంగతి తెలిసిందే.దీంతో ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామాలయం కోసం పునాదిరాయి కూడా పడటం జరిగింది.
దేవాలయం నిర్మాణం కోసం రామాలయం ట్రస్ట్ సభ్యులు బాధ్యత తీసుకొని దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దేశంలో చాలా మంది సెలబ్రిటీలు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు.
ఇలాంటి తరుణంలో అయోధ్య రామాలయం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బడ్జెట్లో దాదాపు ఆరు వందల నలభై కోట్లు అయోధ్య రామాలయం నిర్మాణానికి కేటాయించడం జరిగింది.ఇందులో అయోధ్య రామాలయానికి, అయోధ్య ధామానికి చేరుకునేందుకు రూ.300 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లు వేయబోతున్నారు. అయోధ్య నగర అభివృద్ధికి రూ.140 కోట్లు, అయోధ్య ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి రూ.101 కోట్లు కేటాయించారు.ఇదిలా ఉంటే అయోధ్య పరిధిలో అభివృద్ధి చేయబోతున్న విమానాశ్రయానికి పురుషోత్తమ శ్రీరామా నామకరణం చెయ్యాలని యోగి సర్కార్ డిసైడ్ అయింది.ఇంత భారీ స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ డబ్బులు కేటాయించడానికి కారణం ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా అయోధ్య ని తీర్చి దిద్దే ఆలోచనలు అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రీతిలో అయోధ్య రామాలయం కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ భారీస్థాయిలో నిధులు కేటాయించడం అనే ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.