దూకుడు పెంచిన యోగి...మరో కీలక నిర్ణయం

కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం తో యూపీ సీ ఎం యోగి ఆదిత్యనాథ్ తన దూకుడు పెంచాడు.ఇప్పటికే అనేక విషయాల్లో తన దూకుడుని ప్రదర్శించిన సి ఎం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు.

 Yogi Bans Mobile Phones In Cabinet Meetings-TeluguStop.com

ఇకపై జరగనున్న కీలకమైన కేబినెట్ భేటీల్లో మంత్రులెవరూ ఫోన్లు తీసుకురావద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.మీటింగ్‌లకు వచ్చి కూడా మంత్రులంతా మొబైల్స్ చూస్తూ వాట్సాప్‌లలో మునిగిపోతున్నారన్న నేపథ్యంలో సీఎం యోగి సీరియస్ అయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

-Telugu Political News

ఎవరికీ వారు ఫోన్లలో మునిగిపోతూ మంత్రివర్గ సమావేశంపై మంత్రులెవరూ దృష్టి సారించడం లేదని దీనితో ఇకపై మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులు ఎవరూ కూడా మొబైల్స్ వాడకూడదు అంటూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.దీనితో ఇకపై జరిగే సమావేశాలకు మంత్రులు ముందుగా తమ ఫోన్లను డిపాజిట్ చేసి రావాల్సి ఉంటుంది అన్నమాట.ఇలా చేయడం వల్ల సమావేశాల్లోని కీలక నిర్ణయాలను హ్యాక్ చేయడానికి కానీ, ఎలక్ట్రానిక్ గూఢచర్యం నుంచి ముప్పు కానీ ఉండదని ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube