యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరికొత్త కరోనా నిబంధనలు..!!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలో ఎక్కువగా ఉన్నట్లు ప్రస్తుతం బయటపడుతున్న కేసులు పెట్టి అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది.

 Yogi Adityanath Government Latest Corona Rules Yogi Adityanath, Corona, Uttar Pr-TeluguStop.com

ఈ క్రమంలో కరోనా కట్టడి చేయడం కోసం కేంద్రం వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేస్తూనే మరోపక్క వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆర్మీని దించే ఆలోచన చేస్తోంది.

పరిస్థితి ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేసులు ఎక్కువగా బయటపడుతూ ఉండటంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పట్టణాలతోపాటు గ్రామాలలో పెద్ద ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా కరోనా ఆంక్షలు ఎవరైతే బేఖాతరు చేస్తున్నారో వారిపై చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను హెచ్చరించారు.

బాధ్యతతో ప్రభుత్వాలకు సహకరించాలని పేర్కొన్నారు.అంతే కాకుండా రాష్ట్రంలో వారాంతపు లాక్ డౌన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.500 కోవిడ్ కేసులు దాటిన ప్రతి ఊరిలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది అని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube