దారుణం..విదేశీ మహిళపై అత్యాచారం..హత్యా     2018-04-30   06:21:27  IST  Raghu V

కోవలంలో అదృశ్యమైన లాత్వియా దేశ మహిళ లిగా స్క్రోమేన్‌ మృతదేహం లభ్యమైంది. ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎన్‌ఏ, శవపరీక్ష నివేదికలు రాగానే ఆ ఆరుగురిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు..వివరాలలోకి వెళ్తే..

మానసిక రుగ్మతతో భాదపడుతూ ఎంతో కుంగిపోతున్న విదేశీయురాలైన స్క్రోమేన్‌ ఆమె భర్త ఆండ్రూస్‌, సోదరి ఇల్జాతో కలిసి భారత్‌కు వచ్చారు. చికిత్స నిమిత్తం కోవలంలోని ఆయుర్వేద వైద్యాలయంలో చేరారు. ఈ క్రమంలోనే- మార్చి 14న ఆమె కనిపించకుండా పోయింది ఆ తరువాత తిరువల్లూరులోని మడ అడవుల ప్రాంతంలో ఇటీవల మృతదేహం ఒకటి లభ్యమైంది. విచారణ చేసిన పోలీసులు ఈ మృతదేహం ఆమెదేనని గుర్తించారు..