ప్రముఖ సింగర్ పై గృహహింస, లైంగిక వేధింపుల కేసు?

ప్రముఖ బాలీవుడ్ సింగర్ గా, నటుడిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యోయో హనీ సింగ్‌ పై అతని భార్య షాలిని తల్వార్‌ గృహ హింస, మానసిక ఇబ్బందులు, లైంగిక వేధింపులు వంటి కేసులను నమోదు చేసింది.ఈ క్రమంలోనే తన భర్తపై మంగళవారం” గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం“కింద పిటిషన్ దాఖలు చేసింది.

 Yo Yo Honey Singh Wife Alleges Domestic Violence Case In Court,  Honey Singh, Do-TeluguStop.com

ఈ విధంగా షాలిని తన భర్తపై గృహహింస కేసును తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా ముందు పిటిషన్ దాఖలు చేసింది.

ఈ విధంగా షాలిని తన భర్త పై కోర్టులో పిటిషన్ వేయడం చేత కోర్టు సింగర్ హనీ సింగ్ కు నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే తన భార్య తనపై చేసిన ఆరోపణలకు ఆగస్టు 28 వ లోగా హనీసింగ్ కోర్టుకు సమాధానం తెలపాలని నోటీసులో పేర్కొంది.ఈ క్రమంలోనే సింగర్ అతని భార్య పై ఉన్నటువంటి ఆస్తుల జోలికి వెళ్లకుండా షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Telugu Bollywood, Honey Singh, Shalini Talwar-Movie

కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హనీ సింగ్ సైఫ్ ఆలీ ఖాన్, దీపిక జంటగా నటించిన “కాక్‌టెయిల్‌” చిత్రంలోని ఆంగ్రేజీ బీట్‌ అనే పాట ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను దక్కించుకుంటూ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందనుకున్న క్రమంలో తన పై తన భార్య గృహహింస కేసు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మరి దీనికి సమాధానంగా హనీసింగ్ కోర్టుకు ఏ విధమైనటువంటి సమాధానం తెలియజేస్తారో వేచిచూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube