ప్రముఖ సింగర్ జేసుదాస్ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాధించుకున్నారు.తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ తన పాటలతో ప్రేక్షకులను అలరించిని గాయకడిగా జేసుదాస్ పేరొందాడు.
కాగా తాజాగా జేసుదాస్ సోదరుడు, నాటక రచయిత కేజే జస్టిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.కేరళలోని కొచ్చిలోని బ్యాక్‌వాటర్స్‌లో ఆయన మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.
కేజే జస్టిన్ బుధవారం ఉదయం చర్చికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చిన్ వల్లర్పాడమ్ కంటైనర్ టెర్మినల్ సమీపంలో జస్టిన్ మృతదేహం లభించింది.దీంతో ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా ఆయన కొడుకు మృతి చెందడటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారని, ఆర్ధిక సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కోణంలో పోలీసులు జస్టిన్ ఆత్మహత్య కేసు విచారణ చేపట్టారు.సోదరుడి మృతితో జేసుదాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.