నిన్నటి వరకు రాములమ్మ అన్నారు.. ఇప్పుడు లైన్‌లోకి శివగామి వచ్చింది?

మహేష్‌ బాబు 26వ చిత్రంకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.అనీల్‌ సుంకర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌ బాబు చాలా విభిన్నంగా కనిపిస్తాడని చెబుతున్నారు.

 Yesterday Vijayashanti Now Ramyakrishna For Mahesh 26th Film-TeluguStop.com

ఇప్పటి వరకు మహేష్‌బాబులో చూడని యాంగిల్‌ను ఈ చిత్రంలో చూస్తారంటూ వార్తలు వస్తున్నాయి.అనీల్‌ రావిపూడి సినిమాలు అంటే మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కామెడీ ఉంటుంది.

అలాంటి సినిమాలో మహేష్‌బాబు ఎలా నటిస్తాడు అనే చర్చ ఒకవైపు ఉంటే మరో వైపు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిత్రంతో రాములమ్మ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు దక్కించుకున్న విజయశాంతి రీ ఎంట్రీ గురించి వార్తలు రావడంతో పాటు మహేష్‌బాబు 26వ చిత్రంలో నటించబోతున్నందుకు ఆమె దాదాపుగా రెండు కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

విజయశాంతి ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు చేయాలనుకుంటుంది, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె సినిమాలకు మళ్లీ ఓకే చెప్పిందని అంటున్నారు.అయితే ఈ విషయమై క్లారిటీ రాకుండానే మహేష్‌బాబు 26వ చిత్రంలో ముఖ్య పాత్రకు గాను రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

నిన్న మొన్నటి వరకు విజయశాంతిని ఏ పాత్రకు అయితే అనుకున్నారో ఇప్పుడు ఆ పాత్రకు గాను రమ్యకృష్ణను పరిశీలిస్తున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.ఎందుకంటే రమ్యకృష్ణ శివగామి పాత్రతో స్టార్‌ అయ్యింది.

రీ ఎంట్రీ తర్వాత రమ్యకృష్ణ శివగామి పాత్రతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మళ్లీ ఫేమస్‌ అయ్యింది.అందుకే మహేష్‌బాబు పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయాలని నిర్ణయించారు.

విజయశాంతి కోసం తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత చివరకు ఆమె నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తప్పని సరిపరిస్థితుల్లో రమ్యకృష్ణను ఎంపిక చేయాలని నిర్ణయించారు.మహర్షి విడుదలైన కొన్ని రోజుల్లోనే మహేష్‌ 26వ మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.

సంక్రాంతికి ఈ చిత్రంను విడుదల చేయాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube