మొన్న బిడెన్...నేడు ట్రంప్...తగ్గేదేలె అంటున్న ట్రంప్...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అధికార దుర్వినియోగం చేస్తూ బిడెన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

 Yesterday Biden...today Trump ..trump Is Saying That It Will Decrease, Biden, T-TeluguStop.com

ట్రంప్ పై బిడెన్ కొద్ది రోజుల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా ట్రంప్ బిడెన్ కి కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.అమెరికా మాజీ అధ్యక్షుడిగా తనకు గౌరవం ఇవ్వకపోగా బిడెన్ కావాలాని తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ట్రంప్ ధ్వజమెత్తారు.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో ఉన్న ట్రంప్ ఎస్టేట్ లో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ చేసిన సోదాల నేపధ్యంలో ట్రంప్ బిడెన్ పై స్పందించారు.

గడిచిన రోజులుగా సోదాలు నిర్వహించిన తరువాత మొట్ట మొదటి సారిగా ట్రంప్ బిడెన్ ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.బిడెన్ అమెరికాకు ప్రధాన శత్రువని దేశానికి అతడి వలన ఎంతో ముప్పు ఉంటుందని అన్నారు.

పెన్సిల్వేనియా లోని ఓ ర్యాలీ లో పాల్గొన్న ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార దుర్వినియోగం బిడెన్ హయాంలో జరుగుతోందని మండిపడ్డారు.

ఇక్కడితో ఈ రోజు అయిపోలేదని దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని బిడెన్ ను హెచ్చరించారు.తాజాగా.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.సహజంగా ఎఫ్బిఐ దర్యాప్తు చేపట్టాలంటే ప్రభుత్వ ప్రమేయంతో చేయడానికి ఉండదు.

వారు తప్పనిసరిగా అమెరికా న్యాయశాఖ తో కలిసి దర్యాప్తు చేయాల్సిందే.ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదనే నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ విషయంలో తల దూర్చదనే నియమం ఉంటుంది.

అయితే ఈ సంస్కృతిని విస్మరించి బిడెన్ కావాలని అధికార దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని, ఆ ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ తరహా ఆరోపణలు చేసి ఉంటారని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube