అవును నేను బీజేపీ మనిషినే.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక విద్యావేత్తగా కూడా ఈయనకు ఎంతో మంచి క్రేజ్ ఉంది.

 Yes Iam Bjp Mohan Babu Comments Viral Details, Mohan Babu, Tollywood, Bjp, Comment, Viral, Manchu Vishnu, Manchu Manoj, Tirupati Court, Sri Vidyaniketan, Mohan Babu Comments, Manchu Family, Students Fee Reimbursement-TeluguStop.com

ఇక మంగళవారం మోహన్ బాబు ఆయన కుమారులు మంచు విష్ణు మనోజ్ మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఆయన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు వరకు పాదయాత్రగా వెళ్లడంతో మీడియా పెద్దఎత్తున చుట్టుముట్టి మోహన్ బాబును ఎన్నో ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను బీజేపీ మనిషినని సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో మళ్లీ కూడా మోడీ ప్రభుత్వమే ఉండాలని తాను కోరుకుంటున్నానని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

 Yes Iam Bjp Mohan Babu Comments Viral Details, Mohan Babu, Tollywood, Bjp, Comment, Viral, Manchu Vishnu, Manchu Manoj, Tirupati Court, Sri Vidyaniketan, Mohan Babu Comments, Manchu Family, Students Fee Reimbursement-అవును నేను బీజేపీ మనిషినే.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెడతారు అంటూ ఈయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపాయి.ఇకపోతే కోర్టుకు పాదయాత్ర ద్వారా వెళ్లడానికి ఏదైనా కారణం ఉందా అంటూ మీడియా ప్రశ్నించగా… నేను పాదయాత్ర చేస్తున్నానని ఎవరు చెప్పారు అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

తాను రియల్ హీరో అని తనకు చాలా మంది అభిమానులు ఉండటంతో వారితో సరదాగా మాట్లాడుతూ వెళ్లవచ్చని ఇలా నడుచుకుంటూ వెళుతున్నాను అంటూ మోహన్ బాబు సమాధానం చెప్పారు.

అయితే మోహన్ బాబు తన కుమారులతో కలిసి కోర్టుకు హాజరు కావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్ పై 2019లో కేసు నమోదు అయింది.అప్పట్లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈ హీరోలిద్దరూ ధర్నా చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు.అయితే వీరు ధర్నా చేసిన సమయంలో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలులో ఉండటం వల్ల వీరు కోడ్ ఉల్లంఘిస్తూ దర్నా చేయడంతో వీరిపై కేసు నమోదు అయింది.

ఈ క్రమంలోనే ఈ కేసు నిమిత్తం నేడు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు కోర్టుకు హాజరయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube