య‌ర‌ప‌తినేని దూకుడు.. ఏకంగా వైసీపీ ఖాళీ.. !

గుంటూరు జిల్లా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు దూకుడుగా ఉన్నారు.పార్టీ త‌ర‌ఫున ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నారు.

 Yerapathineni Speed...ycp Empty, Ysrcp, Ycp, Ap Cm, Ys Jagan, Yerapatheneni, Gun-TeluguStop.com

ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై ఆయ‌న పెద్ద ఎత్తున త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ప్ర‌చారం చేస్తున్నారు.అదే స‌మయంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోన్న అన్యాయాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళుతున్నారు.

టీడీపీ హ‌యాంలో జ‌రిగిన అభివృద్దిని కూడా వివ‌రిస్తున్నారు.ఈ యేడాదిన్న‌ర కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా అభివృద్ధి లేద‌న్న విష‌యం కూడా జ‌నాల్లోకి బాగా వెళ్లింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే క‌న్నా య‌ర‌ప‌తినేనే ప్ర‌జ‌ల్లో ఎక్కువుగా ఉంటున్నారు.తాజాగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న దాదాపు 100 కుటుంబాలు గుండుగుత్తుగా వ‌చ్చి.

టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అంతేకాదు, వైసీపీ చేనేత స‌హ‌కార క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా ఉన్న ముశ్యం శ్రీనివాస‌రావు కూడా పార్టీకి బై చెప్పి టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు.

ఇక‌, య‌ర‌ప‌తినేని గ‌త కొన్నాళ్లుగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు.నిజానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న ఇక్క‌డ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.కానీ, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీతో ఆయ‌న ఓడిపోయారు.అయినా కూడా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు.

వారికి ఏది అవ‌స‌ర‌మైనా.తాను ఉన్నానంటూ.

నేరుగా రంగంలోకి దిగుతున్నారు.ఇటీవ‌ల కాలంలో గుంటూరు ప‌రిధిలో జ‌రుగుతున్న అనేక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న హాజ‌రవుతున్నారు.

ఈ క్ర‌మంలోనే పార్టీని బ‌లోపేతం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu Ap Cm, Guntur, Jagan, Mahesh Reddy, Tdp, Yerapatheneni, Ys Jagan, Ysrcp-T

గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు టీడీపీ అనుయాయులుగా ముద్ర వేసి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంచారు.దీనిపై పోరాడుతున్న య‌ర‌ప‌తినేని.వారికి ల‌బ్ది చేకూరేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ముఖ్యంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేలా ఆయ‌న ఇత‌ర నేత‌ల‌ను కూడా స‌మీక‌రించి.నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే దాదాపు వంద కుటుంబాలు టీడీపీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.అదే స‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చార క‌ర్త‌లుగా వీరిలో కింద‌రికి అవ‌కాశం ఇస్తామ‌ని.

టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత బూత్ స్తాయి ప‌దవులు కూడా ఇస్తామ‌ని వారికి హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఏదేమైనా.

య‌ర‌ప‌తినేని దూకుడుతో కేవ‌లం ఏడాదిన్న‌ర‌లో వైసీపీ నుంచి వంద కుటుంబాలు టీడీపీలోకి వ‌చ్చి చేర‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అదే స‌మ‌యంలో కాసు మ‌హేష్‌రెడ్డి లాంటి నేత ఉండి కూడా గుర‌జాల‌లో వైసీపీ ప‌ట్టు కోసం పాకులాడుతుంటే టీడీపీ అప్పుడే పుంజుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube