సంక్రాంతి పోటీలో మంచివాడు నిలుస్తాడా.....?

ప్రస్తుతం ఈ సంక్రాంతి పండుగకి టాలీవుడ్లో స్టార్ హీరోల మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది.ఇందులో ముఖ్యంగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన టువంటి దర్బార్ చిత్రం ముందుగా సంక్రాంతి బరిలోకి దిగి ప్రేక్షకులను అలరించబోతోంది.

 Yentha Manchi Vadavu Raa Sankranthi Mahesh Kalyan Ram-TeluguStop.com

 ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించడంతో రజనీకాంత్ అభిమానులు ఈ చిత్రం పై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.దాంతో ఈ చిత్రం ఈ నెల 9వ తారీఖున థియేటర్లలో కనువిందు చేయబోతోంది.

అయితే ఇది ఇలా ఉండగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొంది చిత్రంపై ఆశలు అమాంతం పెంచేసింది.

మరోపక్క స్టైలిష్ స్టార్ బన్నీ నటించినటువంటి అల వైకుంఠపురంలో చిత్రం కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలైన ఒక రోజు తర్వాత విడుదలవుతోంది. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

 అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ని థియేటర్లు కూడా ఇప్పటికే ఈ మూడు సినిమాలు దాదాపుగా ఆక్రమించేశాయి.

Telugu Kalyanram, Pongalrace, Sathishvignesh, Tollywood-Movie

మరోపక్క నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఎంత మంచి వాడవురా అనే చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.ఈ చిత్రానికి శతమానం భవతి ఫేమ్ దర్శకుడు సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహించాడు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ముగ్గురు స్టార్ హీరోల మధ్య కళ్యాణ్ రామ్ పోటీనీ తట్టుకుంటాడో లేదో అని సినీ పరిశ్రమలో విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో కూడా సతీష్ విగ్నేష్ శతమానం భవతి సినిమాతో  వచ్చి పెద్ద సినిమాల మధ్య పోటీని తట్టుకొని సైలెంట్ హిట్ ఇచ్చాడు.దీంతో మరోసారి ఈ ఫార్ములా వర్కౌట్ చేయడానికి సతీష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube