కనక పుష్య రాగం ఉంగరం ధరిస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు     2018-02-05   21:17:36  IST  Raghu V

పుష్య రాగం బృహస్పతి యొక్క స్వరూపము. తేనె రంగు గోగు పువ్వు రంగు గల పుష్యరాగంను పునర్వసు , విశాఖ నక్షత్రము, పూర్వాబాద్ర నక్షత్రము లలో జన్మించిన వారు గురుని స్వక్షేత్ర రాశులైన ధనుస్సు ,

మీనరాశుల లో జన్మించిన వారు , ధనుస్సు , మీన లగ్నము లలో జన్మించిన వారు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పుష్య రాగంను అత్యంత నాణ్యత గలిగిన దానిని మాత్రమే ధరించాలి.

కనక పుష్య రాగంను సరైన పద్దతిలో ధరిస్తే అద్భుతాలను చూడవచ్చు. నవ రత్నాలలో ఈ రత్నానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రత్నం ధరించిన వారికీ కీర్తి, సంపద, గౌరవం మరియు విజయం లభిస్తాయి.

ఈ రత్నాన్ని ధరించటం వలన వంశాభివృద్ధి,ప్రశాంతత,సంపద,అధికారాన్ని కలిగిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక భావనలు కూడా మెండుగానే ఉంటాయి.

ఈ రత్నాన్ని బంగారంతో ఉంగరంగా చేయించుకొని గురువారం ధరిస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

వివాహం అయిన మహిళలు ఈ రత్నాన్ని ధరిస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ఈ పుష్య రాగంను ధరించటం వలన ఆరోగ్యం, జ్ఞానం, సంపద, దీర్ఘాయుష్షు, కీర్తిప్రతిష్టలు వస్తాయి. అంతేకాక దుష్టశక్తులు వీరి నుంచి దూరంగా పోతాయి.

చదువుకొనే వారు ధరిస్తే చదువు బాగా వస్తుంది. పెళ్లి కానీ అమ్మాయిలు పెట్టుకుంటే తొందరగా పెళ్లి అవుతుంది.

అలాగే వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి.

ముఖ్యంగా మహిళలకు ఈ పుష్య రాగ రత్నం చాలా మంచిది. అంతేకాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మానసికంగా సంతోషంగా ఉండేలా చేస్తుంది.

ఈ రత్నాన్ని ధరిస్తే జాండిస్, గొంతు ఇన్ఫెక్షన్, లివర్ సమస్యలు, లంగ్స్, చెవులు అలాగే రక్త ప్రసరణ సమస్యలు, కడుపుబ్బరం, చర్మ సమస్యలు ,శరీరంలోని కొవ్వు వంటి సమస్యలు వేధించవని జోతిష్య నిపుణుల నమ్మకం. ఎటువంటి దోషాలు లేని పుష్య రాగ రత్నాన్ని ధరిస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చు.