ఇదేందయ్యా ఇది: ఈ రంగు ఉన్న తాబేలును ఎప్పుడైనా చూసారా మీరు...?

సాధారణంగా తాబేలు నలుపు రంగు వర్ణం, ముదురు నీలం రంగులలో ఉంటుంది.కానీ, ఈ తాబేలు మాత్రం మొత్తం పసుపు రంగులో ఉంది.

 Yellow Color Tortoise, Tortoise, Balasore District, Forest Officers-TeluguStop.com

ఇక ఇంతవరకు ఈ తాబేలు ను ఎవరూ ఎప్పుడూ కూడా చూసి ఉండరు.ఈ తాబేలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది.

కాస్త వెలుతురు ఉన్న ప్రదేశానికి వెళ్తే మాత్రం ఆ తాబేలు అచ్చం బంగారం లాగా మెరిసిపోతూ కనిపిస్తోంది.

మరి, నిజానికి ఈ తాబేలు ఎక్కడ గుర్తించారో చూద్దామా మరి… బాలాసోర్‌ జిల్లాలోని సోరో బ్లాక్‌లోని సుజన్‌పూర్‌ గ్రామంలో ఓ వ్యక్తికి ఒకరికి పసుపు రంగులో ఉన్న తాబేలు కనిపించింది.

సదరు వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకుని తాబేలును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా వైల్డ్ లైఫ్ వార్డెన్ భాను మిత్ర ఆచారి మాట్లాడుతూ ఇప్పటివరకు పసుపు రంగులో ఉన్న తాబేలును ఎన్నడూ చూడలేదని, ఇది ఓ అరుదైన తాబేలు అని ఆయన తెలియజేశారు.

Telugu Balasore, Forest Officers, Tortoise, Yellowcolor-

గత నెలలో మయూర్‌భంజ్‌ జిల్లాలోని ద్యూలీ డ్యాం వద్ద జాలర్లకు ట్రియంకిడియా జాతికి చెందిన ఓ తాబేలు ను వారు గుర్తించి, ఓ వ్యక్తి ఆ జాతికి చెందిన తాబేలు ను కూడా ఫారెస్ట్ అధికారులకు అప్పగించడంతో వారు అదే డ్యాంలో తిరిగి వదిలి పెట్టారు.నిజానికి ఇలాంటి తాబేలు ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలలో లభ్యమవుతాయని ఆయన తెలిపారు.వాస్తవానికి వీటి బరువు దాదాపు 30 కేజీల కు పైగానే ఉంటాయని, అలాగే… ఇలాంటి రకం తాబేలు దాదాపు 50 సంవత్సరాల జీవనకాలం సాగిస్తుందని ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube