బూతు సినిమా అని తిడుతున్నారు...అన్ని వ్యూస్ ఎలా వచ్చాయో.? పైగా అంత ఫాన్సీ రేట్ కి అమ్ముడుపోయిందా.?   Yedu Chepala Katha Movie Teaser Creates Sensation     2018-11-07   11:30:04  IST  Sainath G

18 ఏళ్లు వయస్సు దాటిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా. RX 100, అర్జున్ రెడ్డి చిత్రాల్లో లిప్ లాక్‌లు, రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువైతేనే తెలుగు సినిమా ఎటు పోతుంది అనుకున్నాము. ఇక ఈ ‘ఏడు చేపల కథ’ టీజర్ చూస్తే థియేటర్స్ వద్ద నిరాహార దీక్ష చేసినా చేస్తారు. పక్కా బూతు కంటెంట్‌తో నగ్న సన్నివేశాలతో ‘ఏడు చేపల కథ’ అనే సినిమాను రూపొందించారు.

బూతు సినిమా అని తిడుతూనే…ఈ టీజర్ ఏకంగా 18 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసింది. అంత పే…ద్ద బూతు విషయం ఉందన్న మాట ఈ టీజర్. అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలు ఇందులో చాలా ఉన్నాయ్.. అందుకే ఈ అడల్ట్ కామెడీ టీజర్‌ను బాయ్ ఫ్రెండ్‌తోనో.. గర్ల్ ఫ్రెండ్‌తోనో కలిసి మాత్రమే చూడాలని చెప్పిమరీ టీజర్‌ను వదిలారు. ఏడు చేపలుగా ఏడుగురు అమ్మాయిల్ని చూపించి వాళ్లతో అన్ లిమిటెడ్‌గా అందాలను ఆరబోయించారు. లిప్ లాక్‌లతో రెచ్చపోయేలా చేశారు… ఇక బెడ్ రూం సీన్లును సైతం కెమెరాతో రకరకాల యాంగిల్స్‌లో చూపించారు. అంతటితో ఆగకుండా.. ఓ మగువకు మల్లెపూలు పెట్టి మగాడిపై ఎగబడి రేప్ చేస్తున్నట్టుగా చిత్రీకరించి.. ఆ రవిగాడు ముక్కుతూ మూల్గుతూ ‘అమ్మతో చెబుతా’ అంటే సేదతీరుతున్నట్లుగా ‘అప్ లోడ్ అవుతుంది అయిదు నిమషాలే’ అంటూ ఏడు చేపల్లోని ఓ అమ్మాయితో పలికించడం ఇది పక్కా బూతు చిత్రమే అని చెప్పకనే చెబుతోంది.

Yedu Chepala Katha Movie Teaser Creates Sensation-

సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయ్యి అన్ని వ్యూస్ సాధించిన ఈ టీజర్ దెబ్బకు చిత్రం హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకి అమ్ముడి పోయింది. అందుకే ఈ చిత్రానికి సంబంధించి వ‌రల్డ్‌వైడ్ థియెట్రిక‌ల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకొన్నారు.