కోర్టు ఆదేశాల తో శ్రీనగర్ చేరుకున్న సీతారాం ఏచూరి

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీపీఎం నేత సీతారాం ఏచూరి శ్రీనగర్ చేరుకున్నారు.గత కొంత కాలంగా కాశ్మీర్ లో ఉంటున్న ఆయన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే,సీపీఎం నేత తారిగామి కి అనారోగ్య సమస్యల తో బాధపడుతున్నారు.

 Yechury In Srinagar Meets Colleague Mohammed Yousuf Tarigami For Three Hourstst-TeluguStop.com

ఈ క్రమంలో ఏచూరి స్నేహితుడు అయినా ఆయనను స్వయంగా చూసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకోవాలని ఏచూరి రెండు సార్లు కాశ్మీర్ వెళ్ళడానికి ప్రయత్నించగా దానికి పోలీసులు అడ్డుకోవడం తో వెనక్కి రావాల్సి వచ్చింది.దీనితో ఏచూరి సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా దానిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మసనం విచారించి ఏచూరికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

ఓ దేశంలో పౌరుడు ఎక్కడికి వెళ్లాలంటే నిరంభ్యంతరంగా వెళ్లొచ్చని .ఏచూరిని ఆపడం సరికాదని స్పష్టంచేశారు.గురువారం శ్రీనగర్ వెళ్లేందుకు సీతారాం ఏచూరికి అనుమతి ఇచ్చింది.సుప్రీంకోర్టు డైరెక్షన్‌తో ఏచూరి శ్రీనగర్ వెళ్లారు.అయితే ఏచూరి తన స్నేహితుడిని కలిసి వెళ్లిపోవాలని సూచించింది.పర్యటన సందర్భంగా ఎలాంటి రాజకీయాలు చేయొద్దని తేల్చిచెప్పింది.

Telugu Sitaram Yechury, Sitaramyechury, Suffer, Supreme-

ఒకవేళ ఏచూరి రాజకీయ వ్యాఖ్యలు, పొలిటికల్ లీడర్లతో సమావేశమైతే, దానికి సంబంధించి ఆధారాలను తమకు సమర్పించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube