రాజుగారి పదవికి జగన్ ఇలా ఎర్త్ పెట్టారా ?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారమే.పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి అధినేత జగన్ తీరును తప్పుపడుతూ, ఆయన అనేక సంచలన వ్యాఖ్యలు చేయడంతో, పార్టీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 Ys Jagan, Raghurama Krishnam Raju, Sharad Yadav,  Lok Sabha Speaker ,ycp To Canc-TeluguStop.com

ఆ తరువాత ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి వైసీపీపై రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.వైసిపి గుర్తింపు కూడా రద్దు అవుతుంది అంటూ హడావిడి చేశారు.

ఆ తర్వాత బిజెపి కేంద్రమంత్రులను, లోక్ సభ స్పీకర్ ను కలిసి వైసీపీ పై ఫిర్యాదు చేశారు.కాకపోతే అక్కడ ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో, తన స్టాండ్ మార్చుకుని, తాను వైసీపీకి విధేయుడిని అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

అంతేకాకుండా జగన్ కు ఆరు పేజీల లేఖను కూడా నిన్ననే రాశారు.అయితే ఆయన వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలి పెట్టకూడదని, పార్టీ గీత దాటిన ఆయనపై, కఠిన చర్యలు తీసుకుని అనర్హత వేటు పడే విధంగా వైసీపీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది .కేవలం సస్పెండ్ చేసి ఊరుకుంటే, ఆయన బాటలో మరి కొంత మంది ఎంపీలు వెళ్తారని, అందుకే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది.ఈమేరకు వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో కేంద్ర మంత్రులు, బిజెపి అగ్ర నాయకులను కలుస్తూ, పావులు కదుపుతున్నారు.

Telugu Lok Sabha, Sharad Yadav, Ycpraghurama, Ys Jagan-Telugu Political News

గతంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పై రాజ్యసభలో వేటు పడిన విషయాన్ని కూడా ఇప్పుడు వైసీపీ హైలెట్ చేసుకుంటోంది.ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు అయినా విధంగానే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించి, పార్టీ గీత దాటాలనుకున్న వారందరికీ ఒక హెచ్చరికగా రఘురామకృష్ణంరాజు అంశాన్ని చూపించాలనే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది.ఎవరైనా పార్టీ నియమ, నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు అనే విషయాన్ని చెప్పుకునేందుకు వైసీపీ ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేసే విధంగా ప్లాన్ చేసుకుంటోంది.

రఘురామకృష్ణంరాజు మాత్రం ఇప్పుడు వైసిపి ఢిల్లీలో చేస్తున్న వ్యవహారాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

వైసిపి ఒత్తిడి మేరకు బిజెపి తలొగ్గుతుందా లేదా అనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నారు.అనర్హత వేటు పడకుండా సస్పెన్షన్ తో సరిపెడితే బిజెపిలో చేరాలన్నదే ఆయన ప్లాన్ గా తెలుస్తోంది.

వైసిపి మాత్రం పార్టీ నుంచి సస్పెన్షన్ తో పాటు అనర్హత వేటు వేయించి గట్టి ఝలక్ ఇవ్వాలనే విధంగా ప్లాన్ చేసుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube