'జగన్‌కు ఓటేసి మా చెప్పుతో మేం కొట్టుకొన్నాం'

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చిన తమ నిరసన తెలుపుతున్నారు.

 Ycp Worker Srinivas Reddy Comments On Jagan Mohan Reddy-TeluguStop.com

వీళ్లలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు.జగన్‌కు ఓటేస్తే.

వేగంగా అమరావతి నిర్మాణం జరుగుతుందని అనుకున్నాం కానీ.ఇలా జరుగుతుందని ఊహించలేని రైతు, వైసీపీ కార్యకర్త అయిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి అన్నారు.

Telugu Apcm, Ap, Ycpsrinivas-

జగన్‌కు ఓటు వేసినందుకు ఇప్పుడు చెప్పుతో కొట్టుకుంటున్నాం అని అతను అనడం గమనార్హం.అసలు మూడు రాజధానులు కావాలని జగన్‌ను ఎవరు అడిగారని ప్రశ్నించారు.మరోవైపు ఈ మూడు రాజధానుల ప్రతిపాదనపై అధికార వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాక్షాత్తూ మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈ ప్రతిపాదన బాగా లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.ఇది కేవలం ఓ ఆలోచన మాత్రమే అని అనడం విశేషం.

అటు నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.పరిపాలన అంతా ఒక్కచోటు నుంచి జరిగితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి కృషి చేయాలని ఆయన సూచించడం గమనార్హం.

Telugu Apcm, Ap, Ycpsrinivas-

ఇక వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర నాయుడు నిర్మొహమాటంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.అధికార, పాలన వికేంద్రీకరణ కాదు.అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ ప్రతిపాదన వల్ల చిత్తూరు జిల్లా వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఇది సరికాదని ఆయన తేల్చి చెప్పారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube